Murder:వీడిన కూకట్‌పల్లి మర్డర్ మిస్టరీ..అక్కడ పోలీసులే షాక్ అయ్యేలా ఏం జరిగింది ?
Murder:ఈ కథ వెనుక ఉన్న ఆ షాకింగ్ నిజాలను తెలుసుకుంటే, మైనర్లలో పెరుగుతున్న క్రిమినల్ మనస్తత్వం ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థమవుతుంది.

Murder
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆ ఐదు రోజుల పాటు వీడిన మర్డర్(Murder) మిస్టరీ, నమ్మలేని షాకింగ్ నిజాలను బయటపెట్టింది. పదేళ్ల చిన్నారి సహస్ర హత్య, ఎక్కడో ఏదో చిన్న క్లూ దొరికితే తప్ప ఛేదించడం అసాధ్యం అనిపించింది. కానీ ఈ కథ వెనుక ఉన్న ఆ షాకింగ్ నిజాలను తెలుసుకుంటే, మైనర్లలో పెరుగుతున్న క్రిమినల్ మనస్తత్వం ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థమవుతుంది.
హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగిన ఈ హత్య కేసులో, పోలీసులు చివరికి సాయి అనే టీనేజర్ పనిగా తేల్చారు. సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చాడు సాయి. అయితే, అతను కేవలం దొంగతనం కోసమే రాలేదు, ఒకవేళ ఎవరైనా అడ్డుపడితే దాడి చేయడానికి వీలుగా కత్తి కూడా తెచ్చుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి రూ. 80 వేలు దొంగతనం చేసి.. డబ్బు తీసుకుని వెళ్తుండగా, సహస్ర అతన్ని చూసింది. దీంతో భయపడిన సాయి,
సహస్ర నోరు నొక్కి, గొంతు నులిమాడు. అంతటితో ఆగకుండా, ఆమె చనిపోయిందో లేదోనన్న అనుమానంతో గొంతు కోసి, శరీరంపై విచ్చలవిడిగా కత్తితో పొడిచాడు.
Photo:ఒక్క ఫోటో- ఒక చరిత్ర.. ప్రపంచం మర్చిపోని ఫోటోలు
పదిహేనేళ్ల వయసులో ఇలాంటి ఆలోచనలు, ఇంతటి క్రూరమైన ప్రవర్తన చూసి పోలీసులే షాక్ అయ్యారు. విచారణలో మొదట సాయి, తనకేమీ తెలీదన్నట్లు, కేవలం క్రికెట్ ఆడటానికి సహస్ర తమ్ముడి కోసమే వచ్చానని కప్పిపుచ్చడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసుల లోతైన విచారణలో, నేరం అతనిపైకి వస్తుందని గుర్తించి చివరకు నిజం చెప్పాడు. ఈ కేసులో సాంకేతిక ఆధారాలు ఏమీ లేవు. పక్కా సాక్ష్యాలు లేవు. కేవలం ఆ బాలుడు ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు.
ఈ కేసు సుమారు ఐదు రోజులపాటు ఒక మిస్టరీలా మిగిలిపోయింది. ఎందుకంటే, అక్కడ ఎలాంటి టెక్నికల్ ఆధారాలు, పక్కా సాక్ష్యాలు దొరకలేదు. కేవలం అనుమానాల చుట్టూ అల్లుకున్న ఈ కేసు, ఒక మైనర్ పదేపదే ఆ ఇంటి పరిసరాల్లో సంచరించాడన్న చిన్న క్లూతో మొదలైంది. దానిని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తూ వెళ్లి మర్డర్(Murder) మిస్టరీని ఛేదించారు.

మర్డర్(murder) తర్వాత కత్తిని ఎలా పడేయాలో కూడా ముందే అనుకోవడం, ఎవరికీ తెలియకుండా నేరాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించడం వంటివి అతని క్రిమినల్ ఆలోచనలకు నిదర్శనమని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ సంఘటన యువతలో నేర ప్రవృత్తి ఎంత వేగంగా పెరుగుతుందో, ఎంత క్రూరంగా మారుతుందో చూపిస్తుంది. అందుకే, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.
ఇలాంటి క్రూరమైన నేరాలకు పాల్పడే మైనర్ల సామాజిక, పరిసర ప్రేరణల వల్లే ఇటువంటి దారుణాలకు ఒడిగడుతున్నారని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పేదరికం, కుటుంబంలో అస్థిరత, తల్లిదండ్రుల నిర్లక్ష్యం వంటి అంశాలు వారి మనస్తత్వంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. స్నేహితుల చెడు ప్రభావాలకు లోనవడం వంటి కారణాలు నేర ప్రవృత్తిని పెంచుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను జాగ్రత్తగా గమనించి, సరైన శిక్షణ, మార్గనిర్దేశం అందించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
One Comment