Bus accident: కర్నూలు బస్సు ప్రమాదానికి అసలు కారణం ఇదే.. గుట్టు విప్పిన ప్రత్యక్ష సాక్షి

Bus accident: మద్యం మత్తులో శివశంకర్ హైవేపై డివైడర్‌ను ఢీకొట్టి, బైక్‌పై నుంచి కింద పడి మృతి చెందాడు.

Bus accident

కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం(Bus accident)పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయగా, ఈ దర్యాప్తులో అత్యంత కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ ఘోర ప్రమాదానికి, ఇందులో 19 మంది సజీవ దహనానికి కారణమైన సంఘటనల వెనుక ఉన్న అసలు కారణాన్ని ఎర్రిస్వామి అనే ప్రత్యక్ష సాక్షి వెల్లడించాడు.

ప్రమాదానికి దారితీసిన కారణాలు..

పోలీసుల దర్యాప్తు అలాగే ఎర్రిస్వామి ఇచ్చిన సమాచారం ఆధారంగా, ప్రమాదాని(Bus accident)కి ప్రధాన కారణం శివశంకర్ అనే వ్యక్తి మద్యం మత్తులో ద్విచక్ర వాహనం (బైక్) నడపడమే అని నిర్ధారించారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారుజామున 2:23 నిమిషాలకు లక్ష్మీపురం దగ్గర శివశంకర్ పూర్తి మత్తులో ఉన్నాడు. పెట్రోల్ బంక్‌లో కూడా బైక్‌పై నుంచి కింద పడబోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో కూడా నమోదైంది. ఆ తర్వాత, అదే మద్యం మత్తులో శివశంకర్ హైవేపై డివైడర్‌ను ఢీకొట్టి, బైక్‌పై నుంచి కింద పడి మృతి చెందాడు.

Bus accident

ఈ సమయంలో శివశంకర్ బైక్ వెనుక ఉన్న అతని స్నేహితుడు ఎర్రిస్వామికి చిన్న గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఎర్రిస్వామి, శివశంకర్‌ డెడ్‌బాడీని రోడ్డుమీద నుంచి పక్కకు లాగేశాడు. అయితే ఎర్రిస్వామి, రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను కూడా పక్కకు జరుపుదామనే సమయంలోనే, ఆ మార్గంలో వేగంగా వచ్చిన కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టి, ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లింది.

బస్సు ఆ బైక్‌ను ఢీకొని ఈడ్చుకెళ్లడంతో, బైక్‌లోని పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడు కారణంగా మంటలు క్షణాల్లో వ్యాపించాయి. ఈ మంటలు వేగంగా బస్సుకు అంటుకోవడంతో, బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయినట్లు దర్యాప్తులో తేలింది.

అయితే ఈ(Bus accident) ఘటన తర్వాత ఎర్రిస్వామి శివశంకర్ సెల్ ఫోన్‌ను తీసుకుని తన స్వగ్రామం తుగ్గలి మండలం రాంపల్లికి వెళ్లాడు. సెల్ సిగ్నల్ ఆధారంగా శివశంకర్ ఫోన్ ఎర్రిస్వామి దగ్గర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఎర్రిస్వామి ఈ ప్రమాదంపై గుట్టు విప్పాడు. ఎర్రిస్వామి ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ , సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును పూర్తి చేశారు. వి.కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరగడానికి ముందే శివశంకర్ మద్యం మత్తులో మృతి చెందాడనే కీలక విషయాన్ని ఎర్రిస్వామి వెల్లడించాడు.

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 9లో మిడ్ వీక్ ఎలిమినేషన్, వీకెండ్ షాక్

Exit mobile version