Teachers
సాధారణంగా విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. కానీ ఈసారి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయు(teachers)లే పోటీలో దిగుతున్నారు. జీవితంలో ఒక్కడికే దక్కే గౌరవం కోసం.. అపూర్వమైన అవార్డును అందుకోవడానికి ఇప్పుడు ఉపాధ్యాయులు రెడీ అవుతున్నారు.
ఇది అవార్డు అనే కంటే అవార్డు వెనక గల అరుదైన కష్టాలను తెలుసుకునే అవకాశం అనొచ్చు. ప్రతి రోజు పిల్లల మధ్య మేలుకునే ఓ గురువు జీవితం వెనక గల త్యాగాన్ని… ఒక్క ప్రశంసాపత్రంతో బదులిస్తే , గౌరవించాలని ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.
ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 5న జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందించనుంది. దానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. ఆగస్టు 8 చివరి తేదీ. ఆ తరువాత డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా, చివరికి రాష్ట్రస్థాయి కమిటీ ఎంపిక వరకు మొత్తం ప్రక్రియ సాగుతుంది.
మొదటగా డివిజన్ స్థాయిలో ఒక్కో కేటగిరీకి ముగ్గురిని ఎంపిక చేస్తారు. ఆగస్టు 11న ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. తర్వాత జాబితాను డీఈవో (DEO) కార్యాలయానికి పంపిస్తారు. ఆగస్టు 14న జిల్లాస్థాయిలో ఒక్కో కేటగిరీకి ఒకరిని ఎంపిక చేస్తారు. ఆ తరువాత ఆగస్టు 16న ఈ జాబితాను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌కు పంపిస్తారు. ఆగస్టు 21 నుంచి 23 మధ్య ఇంటర్వ్యూలు, ఆగస్టు 25న తుది జాబితా ఖరారు, చివరికి సెప్టెంబర్ 5న అవార్డు ప్రదానం.
ఇది కేవలం ఉపాధ్యాయుడి(teachers) పేరును ప్రకటించే కార్యక్రమం కాదు… తన జీవితాన్ని అంకితం చేసిన గురువు జీవితానికి ముద్ర వేసే అవకాశం. ఒక్క అవార్డు తోనే ఉద్యోగ జీవితాంతం గుర్తింపు, గౌరవం కలుగుతుంది. ఎంపికైన ఉపాధ్యాయులకు రూ. 20,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రం, మెడలో మెరిసే పతకం లభిస్తుంది. .
ఈ ఏడాది మరింత ప్రాముఖ్యత ఏమిటంటే… ప్రతి కేటగిరీలో అభ్యర్థి తనే కాకుండా, ఇతర ఐదుగురు టీచర్లు (teachers) సిఫార్సు చేయవచ్చు. అంటే ఇది వ్యక్తిగత ప్రచారపోటీ మాత్రమే కాదు… ప్రతిభను గుర్తించేందుకు సమష్టిగా ఏర్పడిన వేదికగా మారబోతుందన్న మాట. కేవలం చదివించడం కాదు… పిల్లల జీవితాన్ని మార్చగలగే ఉపాధ్యాయుడి(teachers)కే ఈ గౌరవం దక్కనుంది. సో ఉపాధ్యాయులు ఇంకెందుకాలస్యం.. గెట్ రెడీ
Also Read: Aarogyasri: ఆరోగ్యశ్రీ కార్డు లేదా.. అయినా వైద్యం ఫ్రీ ..ఎలాగో చూడండి..