Aarogyasri: ఆరోగ్యశ్రీ కార్డు లేదా.. అయినా వైద్యం ఫ్రీ ..ఎలాగో చూడండి..
Aarogyasri: 5 లక్షల ఆదాయం ఉన్నా ఆరోగ్యశ్రీ అర్హులే: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలు

Aarogyasri
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ (ఆరోగ్యశ్రీ) పథకం గురించి ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. చాలా మందికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే వైద్యం అందుతుందో లేదోనని టెన్షన్ పడుతుంటారు. కానీ, ప్రభుత్వం అలాంటి వారికి కూడా ఒక గొప్ప అవకాశం కల్పించింది. ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా, ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) అనుమతితో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్యం(treatment is free) అందిస్తోంది.
ఈ విషయం గురించి తెలుసుకుంటే, ఒకవేళ మీకు ఆరోగ్యశ్రీ(Aarogyasri) కార్డు లేకపోయినా, అర్హత ఉంటే చాలు, మీరు వైద్యం పొందవచ్చు. దీనికోసం మీరు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో ఉన్న ఏదైనా ఆసుపత్రికి వెళ్లాలి. అక్కడ ఉండే ‘ఆరోగ్యమిత్ర’ అనే వ్యక్తిని సంప్రదించాలి. ఆయన మీ వివరాలను, అర్హతలను పరిశీలించి, జిల్లా సమన్వయకర్త కార్యాలయానికి సమాచారం ఇస్తారు. అక్కడి నుంచి సీఎంఓ అనుమతి తీసుకున్న తర్వాత, మీకు ఉచితంగా వైద్య సేవలు అందుతాయి. ప్రతిరోజూ ఇలా దాదాపు 20 నుంచి 30 మందికి అనుమతులు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద లభించే ప్రయోజనాలు
ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉన్న కుటుంబాలకు ఈ పథకం ద్వారా అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయి.
- ₹5 లక్షల వరకు ఉచిత వైద్యం: ఒక కుటుంబానికి సంవత్సరానికి ₹5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు లభిస్తాయి.
- పుట్టుకతో వచ్చే వినికిడి, మాటలు రాని సమస్యల చికిత్స కోసం ₹12 లక్షల వరకు ఖర్చు చేయడానికి అనుమతి ఉంది. క్యాన్సర్ రోగులకు ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం భరిస్తుంది.
- ఆరోగ్యశ్రీ కింద 3,257 రకాల వ్యాధులకు, EHS (ఎంప్లాయీ హెల్త్ స్కీమ్) కింద ₹1,000 దాటిన చికిత్సలకు 836 రకాల వ్యాధులకు ఉచిత వైద్యం లభిస్తుంది.
- ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వం ఇస్తుంది.
ఆరోగ్యశ్రీ (Aarogyasri ) పథకానికి అర్హతలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది.
- సంవత్సరానికి ₹5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారు.
12 ఎకరాల లోపు మాగాణి లేదా 35 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న రైతులు. ఈ రెండూ కలిపి 35 ఎకరాల లోపు ఉన్నా అర్హులే. - శాశ్వత ఉద్యోగులు, పెన్షనర్లు కాకుండా, సంవత్సరానికి ₹5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఇతర ఉద్యోగులు కూడా ఈ పథకంలో చేరవచ్చు.
- ఒక కుటుంబానికి ఒక కారు ఉన్నా సమస్య లేదు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 3 వేల చదరపు అడుగుల కంటే తక్కువ ఆస్తి పన్ను చెల్లించేవారు కూడా అర్హులే.
మీకు ఏదైనా సమస్య ఉంటే, ఫిర్యాదు చేయడానికి 104 మరియు 14400 అనే టోల్-ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY) కార్డు ఉన్నవారు దేశంలో ఎక్కడైనా ఒప్పందం ఉన్న ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవచ్చు.
Also read: Operation Akhal : అసలీ ఆపరేషన్ అఖల్ టార్గెట్ ఏంటి?
One Comment