Gold: స్వల్పంగా తగ్గిన పసిడి.. రికార్డులు బద్దలు కొట్టిన వెండి

Gold: ప్రస్తుతం తులం బంగారం ధర (10 గ్రాములు) రూ. 1,30,000 మార్కుకు చేరువలో ఉండగా, రాబోయే రోజుల్లో ఇది లక్షన్నర వైపు పరుగులు పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Gold

దేశీయ మార్కెట్‌లో బంగారం(Gold), వెండి(silver) ధరలు మళ్లీ మండిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యుడికి బంగారం అనేది అందుబాటులో లేని దూరంగా వెళుతోంది. ప్రస్తుతం తులం బంగారం ధర (10 గ్రాములు) రూ. 1,30,000 మార్కుకు చేరువలో ఉండగా, రాబోయే రోజుల్లో ఇది లక్షన్నర వైపు పరుగులు పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

అయితే, శుక్రవారం (అక్టోబర్ 17, 2025) నాటి ధరలను పరిశీలిస్తే, పసిడి ప్రియులకు కేవలం రూ. 20 స్వల్ప ఊరట లభించింది. గురువారంతో పోలిస్తే ఈ స్వల్ప తగ్గింపుతో, దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,29,430 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,18,640 వద్ద స్థిరపడింది.

మరోవైపు, వెండి ధరల దూకుడు మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ‘తగ్గేదేలే’ అన్నట్లుగా దూసుకుపోతున్న వెండి కిలో ధర ఇప్పటికే రూ. 2 లక్షల మార్కును దాటి రికార్డు సృష్టించింది. తాజాగా, కిలో వెండి ధర రూ. 1,88,900 వద్ద కొనసాగుతుండగా, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో మాత్రం ఏకంగా రూ. 2,05,900 వద్ద స్థిరంగా ఉంది. రాబోయే రోజుల్లో వెండి ధరలు కూడా మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold

ప్రధాన నగరాల్లో ధరలను చూస్తే, హైదరాబాద్, విజయవాడ, ముంబైలలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,29,430గా ఉంది. చెన్నైలో అత్యధికంగా రూ. 1,29,830గా నమోదైంది. ఈ అనిశ్చిత పరిస్థితుల కారణంగా చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారం(Gold)పై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, రాజకీయ-భౌగోళిక ఉద్రిక్తతలు పసిడి ధరలకు గట్టి మద్దతు ఇస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, బంగారం ధరలు మరింత భారీగా పెరిగే అవకాశాలున్నాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం… ప్రస్తుత ట్రెండ్ ఆధారంగా, 2028 చివరి నాటికి లేదా 2029 ప్రారంభం కల్లా ఔన్స్ బంగారం ధర $10,000 మార్కును చేరుకుని, దేశీయంగా తులం బంగారం ధర ఏకంగా రూ. 3,00,000 మార్కును దాటే అవకాశం ఉందని అంటున్నారు. ఈ అంచనా భవిష్యత్తులో పసిడి పెట్టుబడుల ప్రాముఖ్యతను మరింత పెంచుతోంది

Shadow: 80 టన్నుల ఏకశిలా గోపురం..అయినా నేలపై పడని శిఖరం నీడ

Exit mobile version