Shadow: 80 టన్నుల ఏకశిలా గోపురం..అయినా నేలపై పడని శిఖరం నీడ
Shadow: ఆలయ ప్రధాన శిఖరం యొక్క నీడ మధ్యాహ్నం సమయంలో భూమిపై పడదని ప్రసిద్ధి. ఇది కేవలం నిర్మాణ అద్భుతం మరియు వాస్తు విజ్ఞానంలోని సూక్ష్మత వల్ల జరిగింది.

Shadow
తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వర దేవాలయం, ప్రపంచంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటి . అలాగే చోళుల నిర్మాణ శైలికి (Chola Architecture) అత్యుత్తమ ఉదాహరణ. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది.
ఆలయ విశేషాలు..
దీనిని క్రీ.శ. 1010 లో చోళ చక్రవర్తి రాజరాజ చోళ-I నిర్మించారు, ఇది సుమారు 1000 సంవత్సరాలుగా పటిష్టంగా నిలిచి ఉంది.
ఆలయ శిఖరం (విమానం) సుమారు 216 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని శిఖరంపై ఉన్న భారీ రాతి స్తంభం (ఏకశిలా గోపురం), 80 టన్నుల బరువు ఉంటుంది. ఈ స్తంభాన్ని అంత ఎత్తుకు తీసుకెళ్లడానికి ఆరు కిలోమీటర్ల పొడవునా వాలుగా (Ramp) మార్గాన్ని ఏర్పాటు చేశారని చరిత్ర చెబుతోంది.

శిఖరం నీడ రహస్యం.. ఆలయ ప్రధాన శిఖరం యొక్క నీడ మధ్యాహ్నం సమయంలో భూమిపై పడదని ప్రసిద్ధి. ఇది కేవలం నిర్మాణ అద్భుతం మరియు వాస్తు విజ్ఞానంలోని సూక్ష్మత వల్ల జరిగింది.
నంది విగ్రహం: ఆలయం ముందు ఉన్న నంది విగ్రహం, ఒకే రాయిపై చెక్కబడిన భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాలలో ఒకటి.
ఈ ఆలయాన్ని పెద్ద ఆలయం (పెరియ కోయిల్) అని కూడా అంటారు. ఇది ద్రావిడ నిర్మాణ శైలిలో చోళుల సాంస్కృతిక, కళాత్మక ,సైనిక శక్తికి ప్రతీక. నిర్మాణంలో ఎలాంటి సిమెంటును ఉపయోగించకుండా, కేవలం రాళ్లను ఇంటర్‌లాకింగ్ చేయడం ద్వారా నిర్మించారు. ఈ ఆలయం కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం.
2 Comments