Gold
దంతేరాస్, దీపావళి పండుగలకు ముందు బంగారం(Gold), వెండి ధరలు విపరీతంగా పెరిగి, కస్టమర్లను, వ్యాపారులను షాక్ కొట్టేలా చేశాయి. బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం, ఈ ధరల పెరుగుదల రోజురోజుకూ భగ్గుమంటోంది.
అక్టోబర్ 14వ తేదీ ఉదయం కొన్ని గంటల వ్యవధిలోనే బంగారం, వెండి ధరల్లో భారీగా పెరుగుదల నమోదైంది.ప్రస్తుతం తులం బంగారంపై ఏకంగా రూ. 3,280 పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ. 4,000 వరకు ఎగబాకింది.
అక్టోబర్ 14 నాటి ధరలు (తెలుగు రాష్ట్రాలు)..
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 1,28,680
22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 1,17,950
18 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 97,700
వెండి 1 కిలో రూ. 2,06,000 (హైదరాబాద్‌లో)
ప్రస్తుతం దేశీయంగా వెండి కిలో ధర రూ. 1,89,000 వద్ద ట్రేడ్ అవుతున్నా కూడా, హైదరాబాద్ వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 2,06,000 వద్ద ఉంది. రాబోయే రోజుల్లో వివాహాల సీజన్ కూడా ప్రారంభం కానుండడంతో, బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం(Gold) ధరలు నిరంతరం పెరుగుతుండటంతో.. మధ్యతరగతి ప్రజలు ఒక దశలో వెండి ఆభరణాలపై దృష్టి సారించారు. అయితే, ఇప్పుడు బంగారం, వెండి రెండింటి ధరలలో వేగవంతమైన పెరుగుదల వల్ల, సామాన్యులు ఆర్టిఫిషియల్ జ్యువెలరీతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.