Gold Lovers
సంక్రాంతి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లోని బంగారం కొనుగోలుదారుల( Gold Lovers)కు పసిడి ధరలు ఊహించని శుభవార్తను మోసుకొచ్చాయి. వారం రోజులుగా దూసుకెళ్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ఈ ఆరు రోజుల్లోనే దాదాపు 4 వేల రూపాయల వరకు పెరిగిన బంగారం ధర, తాజాగా రాత్రికిరాత్రే భారీగా తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. పండుగ పూట గోల్డ్ కొనాలనుకునే గోల్డ్ లవర్స్( Gold Lovers)కు ఇది మంచి అవకాశంగా కనిపిస్తోంది.
కాగా 24 క్యారట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 820 తగ్గింది. అలాగే 22 క్యారట్ల బంగారంపై రూ. 750 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి ధర స్వల్పంగా తగ్గడం దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 4,594 డాలర్ల వద్ద కొనసాగుతూ ఉంది. కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు ఇప్పుడు స్వల్పంగా తగ్గడంతో నగల దుకాణాలు కస్టమర్లతో సందడిగా మారే అవకాశం ఉంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో ఈరోజు గోల్డ్ ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 1,31,250 , 24 క్యారట్ల బంగారం ధర రూ. 1,43,180 కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల ధర రూ. 1,31,400 ఉండగా, 24 క్యారట్ల ధర రూ. 1,43,330 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, చెన్నైలో కూడా హైదరాబాద్ కు సమానంగానే ధరలు నమోదయ్యాయి.
బంగారం ధర తగ్గితే సంతోషపడాలో లేక, వెండి కూడా పెరుగుతోందని భయపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పసిడి బాటలో కాకుండా వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం కిలో వెండిపై ఏకంగా రూ. 3,000 పెరిగింది. కేవలం నాలుగు రోజుల్లోనే కిలో వెండిపై రూ. 35,000 పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.3,10,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబైలలో మాత్రం ఇది రూ. 2,93,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కూడా వెండి ధర రూ. 3,10,000 గా ఉంది. సంక్రాంతి పండుగ పూట వెండి వస్తువులు కొనాలనుకునే వారికి ఈ ధరలు కాస్త భారంగానే మారుతున్నాయి.
Soaked Almonds Benefits : పరగడుపున నానబెట్టిన బాదం తింటే ఇన్ని లాభాలా?
