Start Sunflower Oil
ప్రస్తుతం చాలామందిలో హెల్త్ మీద శ్రద్ధ పెరగడంతో కల్తీ లేని వంట నూనెల (Cold Pressed Oils) కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి సమయంలో సన్‌ఫ్లవర్ ఆయిల్( Start Sunflower Oil) మిల్ ఏర్పాటు చేయడం ఒక గొప్ప లాభదాయకమైన వ్యాపార అవకాశం అంటున్నారు మార్కెట్ నిపుణులు.
ఒకప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మాత్రమే చేసే ఈ ఆయిల్ మిల్ పనిని, ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా కూడా ప్రారంభించొచ్చు. ఈ బిజినెస్ మొదలుపెట్టడానికి ముందుగా కావాల్సింది సన్‌ఫ్లవర్ విత్తనాలను క్రష్ చేసే మిషన్, ఫిల్టర్ మిషన్ , ప్యాకేజింగ్ యూనిట్ కావాలి.
ఒక చిన్న గదిలో 3 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయల పెట్టుబడితో ఈ యూనిట్‌ను స్థాపించొచ్చు. నేరుగా రైతులకు లేదా హోల్‌సేల్ మార్కెట్ నుంచి విత్తనాలను కొనుగోలు చేసి, మీ కళ్ల ముందే నూనె తీసి అమ్ముకోవచ్చు. ఈ వ్యాపారంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, నూనె తీయగా మిగిలిన ఆ విత్తనాల పొట్టును (Oil Cake) కూడా పశువుల మేతగా అమ్మడం ద్వారా ఎక్స్‌ట్రా ఇన్కమ్ లభిస్తుంది.
మార్కెట్‌లో లభించే రకరకాల ఆయిల్ ప్యాకెట్ల కంటే గానుగ నూనె లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిదని కస్టమర్లు భావిస్తారు. కాబట్టి లీటరుకు 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు అదనపు లాభం పొందే అవకాశం ఉంది. స్థానిక కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లతో ఒప్పందం కుదుర్చుకోవడం లేదా మీ సొంత బ్రాండ్‌తో ఆన్‌లైన్లో అమ్మడం ద్వారా బిజినెస్‌ను విస్తరించుకోవచ్చు.
ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు, ముద్రా లోన్ల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది.కాబట్టి ఈ లోన్లను తీసుకుని .. క్వాలిటీ ప్రొడెక్టును అందిస్తున్నామన్న కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుకుంటే ఈ వ్యాపారంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
