24-carat gold: తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం ధర అమాంతం జంప్..అదే బాటలో వెండి

24-carat gold: అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, దేశీయ మార్కెట్లలోని డిమాండ్ మార్పుల వల్ల పసిడి, వెండి ధరల్లో రాత్రికిరాత్రే అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

24-carat gold

తెలుగు రాష్ట్రాల మార్కెట్‌లో బంగారం(24-carat gold), వెండి ధరలు మరోసారి భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, దేశీయ మార్కెట్లలోని డిమాండ్ మార్పుల వల్ల పసిడి, వెండి ధరల్లో రాత్రికిరాత్రే అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

సోమవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం, బంగారంపై భారీగా ధరలు పెరిగాయి.24 క్యారెట్ల బంగారం(24-carat gold) 10 గ్రాములు ఒక్క రోజులోనే రూ.270 పెరిగింది.
22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ఈ ధరపై రూ.250 పెరుగుదల నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,19,550కి చేరింది. ఇక స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,420 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ దాదాపు ఇదే ట్రెండ్ కొనసాగింది.

బంగారం ధరల (24-carat gold)పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలే. అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్‌పై ఏకంగా 12 డాలర్ల పెరుగుదల నమోదైంది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ ధర 4,208 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో, పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

24-carat gold

నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి ధర సైతం సోమవారం రోజు భారీగా పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ.2,100 పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదలతో తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.1,98,900 వద్దకు చేరుకుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.1,98,000 ఉండగా, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,89,000 వద్ద కొనసాగుతోంది.

2026లో బంగారం ధరల(24-carat gold) అంచనా ఎంత?
బంగారం ధరల్లో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ పెరుగుదల కేవలం తాత్కాలికం కాదని, రాబోయే ఏడాదిలో ఈ ట్రెండ్ మరింత బలంగా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక మాంద్యం (Economic Recession) తీవ్రతపై ఆధారపడి, 2026లో ప్రస్తుత స్థాయి నుంచి బంగారం ధరలు 5 శాతం నుంచి 15 శాతం వరకు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర వచ్చే ఏడాది 4,000 డాలర్ల నుంచి 4,500 డాలర్ల మధ్య స్థిరపడొచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేయడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical Tensions) పెరగడం వంటి అంశాలు పసిడికి మరింత డిమాండ్‌ను పెంచుతాయని నిపుణులు భావిస్తున్నారు. అందుకే, బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు దీర్ఘకాలికంగా ప్రయోజనం పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.

మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి ఈ ధరలు నిరంతరం మారుతుంటాయి. కొనుగోలుదారులు ఎప్పటికప్పుడు తాజా ధరలను తెలుసుకోవడం అవసరం అన్న విషయం  మర్చిపోకూడదు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version