Bengaluru Surgeon: నీ కోసమే నా భార్యను చంపేశా.. బెంగళూరు డాక్టర్ అసలు గుట్టు

Bengaluru Surgeon: ఈ హత్య జరిగిన కొన్ని వారాల తర్వాత పలువురు మహిళలకు మహేంద్ర రెడ్డి పంపిన మెసేజీలు సంచలనంగా మారాయి.

Bengaluru Surgeon

బెంగళూరు డాక్టర్(Bengaluru Surgeon) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనస్థీషియాను ఎక్కువ మోతాదులో ఇచ్చి తన భార్యను హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ మహేంద్ర రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తును సవాల్ గా తీసుకున్న పోలీలుసు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో నిందితుడు మొబైన్ ఫోన్ ను పరిశీలించగా కీలక విషయాలు బయటపడ్డాయి. ఒక విధంగా మహేంద్రరెడ్డి అసలు గుట్టు బయటపడినట్టు భావిస్తున్నారు.

ఈ హత్య జరిగిన కొన్ని వారాల తర్వాత పలువురు మహిళలకు మహేంద్ర రెడ్డి పంపిన మెసేజీలు సంచలనంగా మారాయి. నీ కోసమే నా భార్యను చంపేశా అంటూ తనకు తెలిసిన నలుగురు మహిళలకు అతను సందేశం పంపించాడు. అయితే ఈ మెసేజెస్ ను వాట్సాప్, ఎస్ఎంఎస్ రూపంలో కాకుండా ఫోన్ పే, గూగుల్ పేలో టెక్ట్స్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ మెసేజ్ పంపించిన వారిలో అతనితో గతంలో విడిపోయిన గాళ్ ఫ్రెండ్ కూడా ఉన్నట్టు పోలీసులు నిర్థారించారు. తన భార్య హత్య జరిగిన తర్వాత వేరే మహిళలతో సాన్నిహిత్యం పెంచుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినట్టు గుర్తించారు. దీంతో హత్య విషయంలో అతని పాత్రపై మరిన్ని ఆధారాలు సేకరించి కోర్టులో సమర్పించనున్నారు పోలీసులు. బెంగళూరు(Bengaluru)కు చెందిన డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ కృతిక రెడ్డికి గత ఏడాది మేలో వివాం జరిగింది.

Bengaluru Surgeon

బెంగళూరు(Bengaluru)విక్టోరియా హాస్పిటల్లో మహేందర్ రెడ్డి జనరల్ సర్జన్గా పనిచేస్తుండగా, కృతిక రెడ్డి కూడా అదే హాస్పిటల్లో డెర్మటాలజిస్ట్గా పనిచేస్తోంది. కొన్ని నెలల పాటు వీరి బంధం సాఫీగానే సాగినప్పటకీ తర్వాత కృతికకు అనారోగ్యం రావడంతో మహేందర్ రెడ్డి ఆమెకు మెడికల్ టెస్టులు చేయించాడు. కృతికకు అజీర్ణ సమస్య, గ్యాస్ట్రిక్, లో షుగర్ వంటి ఆరోగ్య సమస్యలున్నట్టు తేలింది. దీంతో అనారోగ్యం విషయం తనకు చెప్పకుండా దాచిపెట్టి పెళ్ళి చేసారని రగిలిపోయాడు. ఎలాగైనా భార్యను చంపాలని డిసైడయినట్టు తెలుస్తోంది.

ఈ హత్యకు ఆమె అనారోగ్య కారణాలను అడ్డుపెట్టుకోవాలని పక్కా ప్లాన్ వేశాడు. భార్యకు ఐవీ ఇంజెక్షన్ ను విడతల వారీగా ఇస్తూ రావడంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్ళిపోయింది. కృతికను హాస్పిటల్ లో జాయిన్ చేయగా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్థారించారు. అందరూ సహజ మరణంగానే భావిస్తుండగా.. కృతిక సోదరి అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టమ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అనస్థీషియా పరిమితికి మించి ఇవ్వడంతో చనిపోయిందని నిర్థారించారు. ఇప్పుడు మరికొన్ని విషయాలు కూడా వెలుగుచూడడంతో పోలీసులు మిగిలిన ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

Bigg Boss : ఊహించని నామినేషన్స్.. బిగ్ బాస్ 9 హౌస్‌లో కట్టప్పల రచ్చ..!

Exit mobile version