Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss : ఊహించని నామినేషన్స్.. బిగ్ బాస్ 9 హౌస్‌లో కట్టప్పల రచ్చ..!

Bigg Boss: సుమన్ శెట్టి ఆఖరిలో మిగిలిపోయి, తనూజ బొమ్మ తన చేతిలో ఉన్నా, తన ఫాల్ట్‌గా భావించి తనను తానే నామినేట్ చేసుకున్నాడు.

Bigg Boss

బిగ్ బాస్(Bigg Boss) తెలుగు సీజన్ 9లో 9వ వారం నామినేషన్ల ప్రక్రియ తీవ్ర వాదనలు, గొడవలు , ఊహించని మలుపులతో కొనసాగింది. దివ్వెల మాధురి ఎలిమినేషన్ తర్వాత హౌస్ మేట్స్ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ, ఎలిమినేషన్ బెర్తులు ఖరారు చేసుకున్నారు. ఈ వారం ఏడుగురు సభ్యులు నామినేషన్లలోకి వచ్చారు.

బిగ్ బాస్(Bigg Boss) నామినేషన్ల ప్రక్రియను ‘బొమ్మల టాస్క్’ ద్వారా ప్రారంభించారు. గార్డెన్ ఏరియాలో ఉంచిన బొమ్మలకు హౌస్‌మేట్స్ ఫోటోలు అతికించి, ఎవరి బొమ్మను తీసుకుంటారో వారు సేఫ్ జోన్‌లోకి వెళ్లాలి.

ఆఖరిగా ఎవరు సేఫ్ జోన్‌లోకి చేరుకుంటారో, వారి చేతిలో ఎవరి బొమ్మ ఉంటుందో ఆ వ్యక్తి నామినేట్ అవుతాడు. ఈ రూల్ ప్రకారం మొదట సంజన ఆఖరిలో ఉండి, రీతూను నామినేట్ చేసింది. అయితే, ఆ తర్వాత సుమన్ శెట్టి ఆఖరిలో మిగిలిపోయి, తనూజ బొమ్మ తన చేతిలో ఉన్నా, తన ఫాల్ట్‌గా భావించి తనను తానే నామినేట్ చేసుకున్నాడు. ఈ భావోద్వేగాల తర్వాత, బిగ్ బాస్ నామినేషన్ రూల్స్‌ను మార్చేశారు.

రూల్స్‌ మార్చిన తర్వాత నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా మారింది. ముందుగా సేఫ్ జోన్‌లోకి వెళ్లే ఇద్దరు హౌస్‌మేట్స్, తమ చేతిలో ఉన్న బొమ్మపై ఉన్న వ్యక్తితో కలిసి మరొకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది.

Bigg Boss
Bigg Boss

సాయి – తనూజ: ఆఖరిలో వచ్చిన సాయి, తనూజను నామినేట్ చేశాడు. తనూజ-భరణి తమలో ఎవరు ఉండాలో వాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

దివ్య – భరణి షాక్: కెప్టెన్ దివ్య అనూహ్యంగా భరణిని నామినేట్ చేసి అందరినీ షాక్‌కి గురిచేసింది.

తనూజ – ఇమ్మానుయేల్ గొడవ: తనూజ, ఇమ్మానుయేల్‌ని నామినేట్ చేయగా, దానికి ఇమ్మూ గట్టిగానే కౌంటర్లు ఇచ్చాడు.

నిఖిల్ – తనూజ వాదన: మరో రౌండ్‌లో నిఖిల్, తనూజని నామినేట్ చేయడంతో వారి మధ్య పెద్ద వాదన జరిగింది. సంచాలక్ డీమాన్ జోక్యం చేసుకున్నాడు.

రాము, కళ్యాణ్‌ను నామినేట్ చేయడం, ఆ తర్వాత డీమాన్ సంచాలక్‌గా ఉండి ఇమ్మూని సేవ్ చేసి కళ్యాణ్‌ని నామినేట్ చేయడం వంటి క్లాష్‌లు ఈ వారం హైలైట్‌గా నిలిచాయి.

నామినేషన్ల మధ్య సంజన బోరున ఏడ్చింది. తనకోసం జుట్టు కత్తిరించుకున్న రీతూతోనే వాదన పడాల్సి వచ్చిందంటూ సంజన బాధపడింది. అందరూ వచ్చి ఓదార్చినా ఆమె చాలా సేపు ఏడుస్తూనే ఉంది.

చివరికి, కెప్టెన్ దివ్యకు బిగ్ బాస్ ఒకరిని నేరుగా నామినేట్ చేసే స్పెషల్ పవర్‌ను ఇచ్చాడు.దివ్య, తన స్పెషల్ పవర్‌ను ఉపయోగించి తనూజను డైరెక్ట్ నామినేట్ చేసింది. దాంతో తనూజ ఒక్కసారిగా దివ్యపై ఎటాక్ చేసింది. అయితే కెప్టెన్‌గా దివ్య ఎక్కడా తగ్గకుండా సీరియస్ కౌంటర్లు ఇచ్చింది.

తీవ్ర వాదోపవాదాల తర్వాత ఈ వారం నామినేషన్లలోకి వచ్చిన ఏడుగురు హౌస్‌మేట్స్ సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, రాము, సాయి, తనూజ నిలిచారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button