Pawan Kalyan: సెప్టెంబర్ 2న పవన్ ఫ్యాన్స్ కోసం డబుల్ ట్రీట్ వెయిటింగ్..

Pawan Kalyan:సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా గురించి అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు, పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ యూనిట్ ఒక గ్రాండ్ ట్రీట్ ప్లాన్ చేసింది.

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘ఓజీ’ (OG). ఈ సినిమా గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియా షేక్ అవుతోంది. సినిమా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ కంటే కూడా ‘ఓజీ’ కోసమే ఫ్యాన్స్ ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా గురించి అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు, పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ యూనిట్ ఒక గ్రాండ్ ట్రీట్ ప్లాన్ చేసింది.

గతేడాది పవన్ పుట్టినరోజు సందర్భంగా ‘హంగ్రీ చీతా’ గ్లింప్స్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపినట్టే, ఈసారి కూడా ఒక హై-వోల్టేజ్ వీడియో సాంగ్‌తో అభిమానులకు కన్నుల పండుగ చేయాలని డైరెక్టర్ సుజీత్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఆడియోగా విడుదలైన ‘ఓజీ’ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే పాటను ఇప్పుడు పవన్ పుట్టినరోజు సందర్భంగా వీడియో సాంగ్ రూపంలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట.

ఈ వీడియోలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్టైలిష్ లుక్, డైనమిక్ యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయం. ముఖ్యంగా ఈ వీడియోతో పాటు సినిమా గురించి ఒక కీలకమైన అప్‌డేట్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇది సినిమా ఫ్యాన్స్‌కు గ్యారంటీగా డబుల్ ట్రీట్ అవుతుంది.

Pawan Kalyan

ఓజీ(OG)తో పాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh) సినిమా నుంచి కూడా బర్త్‌డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌లు లేదా టీజర్ వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాల నుంచి వచ్చే సర్ప్రైజ్‌లతో పవన్ అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ఓజీ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. ఈ అప్‌డేట్స్ సినిమాపై మరింత హైప్ పెంచి, బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాయని చెప్పొచ్చు.

 

 

Exit mobile version