Just PoliticalJust Andhra PradeshLatest News

Pawan Kalyan: పవన్ రీ-ఎంట్రీ.. సైలెంట్‌గా ఉన్న జనసేనాని ఇకపై స్పీడ్ పెంచబోతున్నారా?

Pawan Kalyan:మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్, కొత్త పథకాల రూపకల్పన, శాఖల నిర్వహణపై దృష్టి పెట్టడంతో పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు దూరమయ్యారన్న విమర్శలు వచ్చాయి

Pawan Kalyan

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో భారతీయ రాజకీయాల్లో తన పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. మంత్రిగా పాలనా బాధ్యతలపై ఎక్కువ దృష్టి పెట్టడం, పార్టీ కార్యకర్తలతో సంబంధాలు తగ్గడం, కాపు సామాజిక వర్గానికి అనుకూల మద్దతు లభించకపోవడం వంటి విమర్శలు ఫేస్ చేశారు. ఇప్పుడు ప్రత్యర్థుల వ్యూహాలను ఎదుర్కొంటూ, పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మొదటిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్, కొత్త పథకాల రూపకల్పన, శాఖల నిర్వహణపై దృష్టి పెట్టడంతో పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు దూరమయ్యారన్న విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కాపు వర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రయోజనాలు లభించకపోవడం పార్టీకి ప్రతికూల ప్రభావం చూపింది. కొన్ని నెలలుగా పవన్ మౌనంగా ఉండటం, సోషల్ మీడియాలో విమర్శలను ఖండించకపోవడం ప్రతిపక్షాలకు మరింత బలం ఇచ్చింది. ఇప్పుడు ఈ పరిస్థితులను మార్చేందుకు పవన్ తన వ్యూహాన్ని మార్చుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ తన జనసేన(Janasena party) పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నారునియోజకవర్గాలలోని ముఖ్య నాయకులతో సమావేశమై అక్కడి రాజకీయ పరిస్థితులను సమీక్షించి, వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇది కూటమిలో సమన్వయాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

దిగువ స్థాయి నాయకుల సమస్యల పరిష్కారం దిశగాఅడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు. పార్టీ నేతలకు పింఛన్ల పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో టీడీపీ నాయకుల నుంచి ఎదురవుతున్న అడ్డంకులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలన్న భావనలో ఉన్నారు. కూటమిలోని ఇతర పార్టీలు విస్మరిస్తున్న నియోజకవర్గాలను గుర్తించి అక్కడ పర్యటించి, అక్కడి నాయకులలో కొత్త ఉత్సాహాన్ని నింపడం ద్వారా పార్టీ ఫలితాలను మెరుగుపరచాలని పవన్ భావిస్తున్నారు.

పవన్ ప్రతి మూడు నెలలకు ఒకసారి కూటమి అగ్రనేతలతో సమావేశాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబును ప్రతిపాదించబోతున్నారు. ఇది కూటమిలో సమన్వయ బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

pawan-kalyan
pawan-kalyan

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి.ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టడం వల్ల పార్టీని బలోపేతం చేసే పని నెమ్మదిగా సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి.కూటమిలో పార్టీకి సరైన గౌరవం లభించలేదన్న భావన పార్టీ కార్యకర్తల్లో ఉంది.పవన్ మౌనం వహించడంతో సోషల్ మీడియాలో విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇది పార్టీ కార్యకర్తలలో నిరుత్సాహాన్ని పెంచుతోంది.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఇప్పుడు తన రాజకీయ ఇమేజ్‌ను పునర్నిర్మించుకునే, పార్టీని తిరిగి ప్రబలింపజేసే కీలక ప్రయాణంలో ఉన్నారు. ఎన్నికలకు ముందు తీసుకునే ఈ చర్యలు రాబోయే నాలుగు సంవత్సరాలలో జనసేన పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వ్యూహాలు అమలు అయితే జనంలో పెరిగిన ఆశలు, పార్టీని మరింత బలపరిచే అవకాశం ఎక్కువ.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button