Sunk Cost Fallacy
మీరు ఒక హోటల్‌కి వెళ్లి ఒక ఖరీదైన బిర్యానీ ఆర్డర్ చేశారనుకోండి. కానీ అది అస్సలు బాలేదు. కానీ అమ్మో ఇంత ధర పెట్టి కొన్నాను కదా.. వేస్ట్ చేయకూడదని బలవంతంగా కడుపు నిండా తినేస్తారు. దీంతో మరుసటి రోజు కడుపు నొప్పి తెచ్చుకుంటారు.
అలాగే ఏదైనా వ్యాపారంలో కానీ, ఫలించని ప్రేమలో కానీ ఇప్పటికే చాలా సమయం, డబ్బు ఖర్చు చేశాం కదా అని నష్టపోతున్నా కూడా అందులోనే ఉండిపోతారు. దీనినే సైకాలజీలో సన్క్ కాస్ట్ ఫాలసీ (Sunk Cost Fallacy) అంటారు.
సన్క్ కాస్ట్ పాలసీ(Sunk Cost Fallacy) అంటే మనం ఇప్పటికే ఖర్చు చేసి, తిరిగి దానిని పొందలేనటువంటిది. దీనిలో సమయం, డబ్బు లేదా శ్రమ ఉంటాయి . మనిషి మెదడుకు ఒక వింత స్వభావం ఉంది. అదేమిటంటే ఇప్పటి వరకూ పెట్టిన పెట్టుబడిని వదులుకోవడానికి ఇష్టపడదు.
అది నష్టమని బాగా తెలిసినా, ఆ పెట్టుబడిని కాపాడుకోవాలనే తాపత్రయంలో మనిషి మైండ్.. భవిష్యత్తులో కలగబోయే మరిన్ని నష్టాలను కూడా ఆహ్వానిస్తుంది. బాగోలేని సినిమాను టికెట్ డబ్బుల కోసం చూడటం వల్ల.. మీకు టికెట్ డబ్బులు వెనక్కి రావు సరే..కానీ మీ అమూల్యమైన మూడు గంటల సమయం కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందన్న విషయాన్ని అంగీకరించలేరు.
గతంలో మీరు పెట్టిన పెట్టుబడి అంటే డబ్బు , సమయం, శ్రమ ఎలాగూ తిరిగి రాదు. ఏదైనా పని మీకు సంతోషాన్ని ఇవ్వనప్పుడు, మీ ఎదుగుదలకు తోడ్పడనప్పుడు.. మొహమాటపడకుండా దానికి స్వస్తి చెప్పేయడమే తెలివైన పని. ఎందుకంటే గతాన్ని చూసి భవిష్యత్తును ఎప్పుడూ బలి చేయకండి. మారడం అంటే ఓడిపోవడం కాదని, కొత్తగా గెలవడానికి వేసే అడుగు అని ఎప్పుడూ గుర్తుంచుకోండి!
Gold rates:బంగారం మళ్లీ పైకి..బంగారం కొనొచ్చా ..వెయిట్ చేయాలా?
