Bigg Boss: బిగ్ బాస్ ఆరోవారం..’ఫ్యామిలీ మ్యాన్’ భరణి సేఫ్, ఎలిమినేషన్ గండంలో సుమన్ శెట్టి!

Bigg Boss: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లు – భరణి, తనూజ, రాము రాథోడ్, దివ్య నిఖిత, సుమన్ శెట్టి, డెమాన్ పవన్ మధ్య ఓటింగ్ రసవత్తరంగా సాగుతోంది.

Bigg Boss

బిగ్ బాస్(Bigg Boss) 9వ సీజన్ ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఐదో వారంలో దమ్ము శ్రీజ ఎలిమినేషన్ తర్వాత, ఈ వారం కూడా షాకింగ్ ఎలిమినేషన్ ఉండవచ్చని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లు – భరణి, తనూజ, రాము రాథోడ్, దివ్య నిఖిత, సుమన్ శెట్టి, డెమాన్ పవన్ మధ్య ఓటింగ్ రసవత్తరంగా సాగుతోంది.

ఐదో వారం శ్రీజ ఎలిమినేషన్‌తో బిగ్ బాస్(Bigg Boss) 9 తెలుగు షో ఒక లెక్క అయితే, వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత ఈ సీజన్ ఇంకో లెక్క అన్నట్టుగా మారిపోయింది. గత సీజన్‌లకు భిన్నంగా, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీ తర్వాత షో నాణ్యత పడిపోయిందని ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా దివ్యెల మాధురి హౌస్‌లో అడుగుపెట్టడంతో షో కంటెంట్ ఆడియన్స్‌కు మరింత కంపరం తెప్పిస్తుందని విశ్లేషణలు చెబుతున్నాయి.

ఈ ఆరో వారం నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.. భరణి, తనూజ, రాము రాథోడ్, దివ్య నిఖిత, సుమన్ శెట్టి, డెమాన్ పవన్. గతవారం దమ్ము శ్రీజ ఎలిమినేషన్ ఎంత షాకింగ్‌గా ఉందో, ఈ వారం కూడా అలాంటి అనూహ్యమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే, నామినేషన్స్‌లో ఉన్న వారి మధ్య ఓటింగ్ లెక్కలు నువ్వా-నేనా అన్నట్టుగా రంజుగా సాగుతున్నాయి.

Bigg Boss

ముఖ్యంగా ఆడియన్స్ అభిప్రాయం తెలుసుకోవడానికి నిర్వహించిన పోల్‌లో దిమ్మతిరిగే ఫలితం వచ్చింది. కచ్చితంగా సేఫ్ అయ్యే కంటెస్టెంట్లలో ఒకరైన తనూజ తర్వాత, మిగిలిన ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారనే పోల్‌కు వచ్చిన రిజల్ట్:

ఈ ఓటింగ్ ప్రకారం చూస్తే, సుమన్ శెట్టి , దివ్య నిఖిత మధ్య ఎలిమినేషన్ వార్ నడుస్తోంది. వీరిద్దరిలో ఒకరు హౌస్(Bigg Boss) నుంచి బయటకు వెళ్లడం ఖాయమని పోల్ ఫలితం స్పష్టం చేస్తోంది. డెమాన్ పవన్, రాము రాథోడ్ వీక్ కంటెస్టెంట్లుగా ఉన్నా, సుమన్ శెట్టికి అత్యధిక శాతం ఓటింగ్ రావడం నిజంగా ఆశ్చర్యకరం.

ఆరో వారం ఓటింగ్‌లో ఫ్యామిలీ మ్యాన్ భరణి ఎలిమినేషన్ కేటగిరీలో అత్యల్పంగా 8 శాతం ఓట్లు మాత్రమే పొందారు. అంటే, ఆయన సేఫ్ జోన్‌లో ముందున్నట్టు లెక్క. హౌస్ లోపల, హోస్ట్ నాగార్జున కూడా భరణి ‘బాండింగ్స్’ పెట్టుకుంటూ డౌన్ అయిపోతున్నారని కామెంట్లు చేసినా, ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు బలంగా ఉంది.

నాన్న, అన్న, చెల్లి, కూతురు వంటి ఫ్యామిలీ రిలేషన్ బాండింగ్‌లను భరణి మెయింటైన్ చేస్తుండటం కామన్ ఆడియన్స్‌కు పెద్ద ఇబ్బందిగా అనిపించడం లేదు.

రీతూ చౌదరి, డెమాన్ పవన్‌ల మాదిరిగా అసభ్యకరమైన ఎఫైర్ బాండింగ్‌లు పెట్టుకుంటేనే జనం అసహ్యించుకుంటారు కానీ, ఇలాంటి ఫ్యామిలీ ఎమోషనల్ బాండింగ్‌లకు ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు వేయడానికి వెనుకాడటం లేదనే విషయం ఈ ఓటింగ్ లెక్కల ద్వారా స్పష్టమవుతోంది.

గత వారం చాలా పోల్స్‌లో శ్రీజ సేఫ్ అవుతుందని ఫలితం వచ్చినా, సమయం పోల్‌లో ఆమె ఎలిమినేట్ అవుతుందని రిజల్ట్ వచ్చి నిజమైంది. కాబట్టి, ఈ వారం సుమన్ శెట్టి లేదా దివ్య నిఖితలలో ఒకరి ఎలిమినేషన్ షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Gold: స్వల్పంగా తగ్గిన పసిడి.. రికార్డులు బద్దలు కొట్టిన వెండి

Exit mobile version