Free Bus
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్న ‘మహాలక్ష్మి’ పథకంలో తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు మహిళలు బస్సుల్లో ఉచితం(Free Bus)గా ప్రయాణించడానికి ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు కానీ, ఒరిజినల్ ఐడీ కార్డు కానీ కండక్టర్లకు చూపించాల్సి వచ్చేది.
అయితే ఆధార్ కార్డుల్లో పాత ఫోటోలు ఉండటం, క్లారిటీ లేకపోవడంతో మహిళలను గుర్తించడంలో కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల తరచూ బస్సుల్లో వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టే విధంగా శాశ్వత పరిష్కారం చూపుతూ, ప్రభుత్వం మహిళలందరికీ ప్రత్యేకంగా ‘మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్స్’ జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈ స్మార్ట్ కార్డ్స్ చూడటానికి ఏటీఎం కార్డు తరహాలోనే ఉండి, అత్యాధునిక సాంకేతికతతో కూడి ఉంటాయి. ప్రతి కార్డుపై మహిళ ఫోటోతో పాటు పేరు, చిరునామా వివరాలు అన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఈ కార్డుపై ఒక ‘చిప్’ , ‘క్యూఆర్ కోడ్’ (QR Code) ఉంటాయి.
మహిళలు ఉచిత ప్రయాణం చేయడానికి(Free Bus) బస్సు ఎక్కగానే కండక్టర్ దగ్గర ఉండే మిషన్ ద్వారా ఈ కార్డును స్కాన్ చేస్తే చాలు, వెంటనే ‘జీరో టికెట్’ జారీ వచ్చేస్తాది. దీనివల్ల ప్రయాణం ఇంక ఈజీ అవడమే కాకుండా, ప్రభుత్వం వద్ద ప్రయాణికుల కచ్చితమైన గణాంకాలు ఉంటాయి. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే 75 కోట్ల రూపాయల నిధులను ఆర్టీసీకి కేటాయించింది.
తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మంది మహిళలకు ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ప్రతి మహిళకు 16 అంకెలతో కూడిన ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను (Unique ID Number) కేటాయిస్తారు.
దీనిగురించి ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతోంది.
మొదటగా 5 లక్షల మందికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ కార్డులు ఇచ్చి, ఆ తర్వాత అందరికీ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల మహిళలు తమ వెంట ఆధార్ కార్డును క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు.
Salary:నెల తిరగకుండానే శాలరీ ఖర్చయిపోతుందా ? ఈ రూల్ ఫాలో అయి డబ్బులు సేవింగ్ చేయండి..
