Bigg Boss: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్స్ ఎవరో తెలిసిపోయింది..

Bigg Boss: బాగా పాపులర్ అయిన సెలబ్రిటీలతో పాటు, గత సీజన్లలో తమ ఆటతీరుతో ఆకట్టుకున్న వారిని కూడా తిరిగి హౌస్‌లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Bigg Boss

బిగ్‌బాస్ (Bigg Boss)తెలుగు సీజన్ 9 మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి నిర్వాహకులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గత సీజన్‌కు తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడంతో, ఈసారి ప్రేక్షకులను అలరించడానికి కొత్త కాన్సెప్ట్‌లు, నియమాలతో పాటు, అత్యంత ఆకర్షణీయమైన కంటెస్టెంట్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక రూమర్ లిస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

గతంలో, సామాన్యంగా తెలియని వారిని కంటెస్టెంట్స్‌గా తీసుకువచ్చేవారు. కానీ ఈసారి అందుకు పూర్తి భిన్నంగా బాగా పాపులర్ అయిన సెలబ్రిటీలతో పాటు, గత సీజన్లలో తమ ఆటతీరుతో ఆకట్టుకున్న వారిని కూడా తిరిగి హౌస్‌లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముక్కు అవినాష్, రోహిణి వంటి వారు గతంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి చాలా పాపులర్ అయ్యారు. ఈసారి అలాంటి వారిని నేరుగా లాంచ్ రోజునే హౌస్‌లోకి పంపించే అవకాశం ఉంది. ఈసారి ఏకంగా 18 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళ్లబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ప్రకారం, ఈసారి హౌస్‌లోకి వెళ్లే వారిలో వీరు ఉండొచ్చని తెలుస్తోంది:

Bigg Boss

నటులు: సుధాకర్, భరణి.

బుల్లితెర నటులు: సీరియల్ నటుడు శివకుమార్, అమర్‌దీప్ చౌదరి సతీమణి, నటి తేజస్విని గౌడ, బ్రహ్మముడి ఫేమ్ దీపిక రంగరాజు, దేబ్‌జనీ మోదక్.

ఇతర సెలబ్రిటీలు: కొరియోగ్రాఫర్ శ్రేష్టీ వర్మ, సీనియర్ హీరోయిన్ ఆశా షైనీ, కన్నడ నటి తనూజ పుట్టస్వామి, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ, అలేఖ్య చిట్టిపికిల్స్ నుంచి రమ్య మోక్ష, కమెడియన్ బంచిక్ బబ్లూ.

ఈసారి సామాన్య ప్రజలకు కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఇచ్చారు. దీనికోసం “బిగ్‌బాస్ అగ్నిపరీక్ష” పేరుతో రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఇందులో ఎంపికైన వారిలో దమ్ము శ్రీజ, అనూష పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ లిస్టులోంచి ఒకరిద్దరు చివరి నిమిషంలో మారొచ్చని పుకార్లు వినిపిస్తున్నప్పటికీ, చాలా వరకు ఈ పేర్లు ఫైనల్ అయినట్లుగా చెబుతున్నారు.

మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ లిస్ట్ నిజమేనా? లేదా బిగ్‌బాస్(Bigg Boss) ఈసారి కూడా ఊహించని ట్విస్ట్ ఇస్తాడా? అనేది సెప్టెంబర్ 7న షో ప్రారంభమైన తర్వాతే తేలిపోతుంది. అంతవరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూ ఉండాల్సిందే.

Gold : మరోసారి పెరిగిన పుత్తడి ధర.. ఈరోజు ఎంత పెరిగిందంటే..

Exit mobile version