Gold : మరోసారి పెరిగిన పుత్తడి ధర.. ఈరోజు ఎంత పెరిగిందంటే..
Gold :అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభాలు, యుద్ధాలు వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారంపై దృష్టి పెట్టడం బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం

Gold
భారత్‌లో బంగారం (Gold) ధరలకు రోజురోజుకు రెక్కలొస్తున్నాయి. అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తుందన్న అంచనాలు బంగారం ధరలకు ఊపునిస్తున్నాయి. ఈరోజు, 2025 ఆగస్టు 30న, దేశంలో బంగారం, వెండి, ప్లాటినం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు, అంటే ఆగస్టు 30, 2025న, దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.1,03,320కి చేరుకుంది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.94,710, ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (Gold)ధర రూ.77,490గా ఉంది. బంగారం మాదిరిగానే, వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ.1,19,800కు చేరగా, ప్లాటినం ధర గ్రాముకు రూ.38,160గా ఉంది.
అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభాలు, యుద్ధాలు వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారం(Gold)పై దృష్టి పెట్టడం బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. . అలాగే, అమెరికా వంటి దేశాలు వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు కూడా బంగారం డిమాండ్ పెరుగుతుంది. అదే సమయంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నప్పుడు, లేదా డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి.

ఇక, దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (24కే, 22కే, 18కే) ఇలా ఉన్నాయి: చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, కేరళ, పుణెలలో రూ.1,03,320; రూ.94,710; రూ.77,490. ఢిల్లీలో ధరలు రూ.1,03,470; రూ.94,860; రూ.77,620గా ఉన్నాయి. వడోదరా, అహ్మదాబాద్ నగరాల్లో రూ.1,03,370; రూ.94,760; రూ.77,540గా ఉన్నాయి.
అలాగే వెండి ధరలు చెన్నై, హైదరాబాద్, కేరళలో కిలోకు రూ.1,29,800 ఉండగా, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె, వడోదరా, అహ్మదాబాద్‌లలో రూ.1,19,800గా ఉంది.
గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి కొనే సమయంలో వాటిని మరోసారి ధృవీకరించుకోవాలని సూచన.
5 Comments