Bigg Boss: మాధురి –కళ్యాణ్ గొడవ..బిగ్ బాస్ హౌస్‌లో నాగార్జున వీకెండ్ క్లాస్

Bigg Boss: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో రచ్చ రెట్టింపు అయ్యింది. ఈ వారం ఎలిమినేషన్స్‌కు సంబంధించి మొత్తం ఆరుగురు నామినేషన్స్‌లో నిలిచారు.

Bigg Boss

బిగ్ బాస్(Bigg Boss) సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. గొడవలు, టాస్క్‌లు, ఎమోషనల్ సీన్స్‌తో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తోంది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో రచ్చ రెట్టింపు అయ్యింది. ఈ వారం ఎలిమినేషన్స్‌కు సంబంధించి మొత్తం ఆరుగురు నామినేషన్స్‌లో నిలిచారు. కాగా..వీకెండ్ ఎపిసోడ్ ప్రోమోలో నాగార్జున హౌస్ సభ్యులకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు.

నాగార్జున ఈ వారం కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లకు ఆటాడించారు. ఆయన వారికి కిరీటాలు పెట్టి, వారికి ఆ హౌస్‌లో ఉండే అర్హత (డిజర్వ్) ఉందా లేదా అని పాత కంటెస్టెంట్లను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా, తొలిసారిగా ఆడియన్స్‌కు కూడా ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చి, హౌస్‌లో జరిగిన గొడవలు, ప్రవర్తనపై ఓట్లు వేయించారు.

ముందుగా, నాగార్జున హౌస్‌(Bigg Boss)లో జరిగిన మాధురి, కళ్యాణ్ మధ్య గొడవను ప్రస్తావించారు. సుమన్ శెట్టిని లేపి, ఆ గొడవలో తప్పు ఎవరిది అని అడగ్గా, సుమన్ ‘మాధురిగారిది’ అని బదులిచ్చాడు. వెంటనే నాగ్ వీడియో ప్లే చేసి చూపించారు. ఆ తర్వాత మాధురి తన చర్యను సమర్థించుకోవడానికి ప్రయత్నించగా, నాగార్జున జోక్యం చేసుకుని, మాట్లాడింది కరెక్టే… కానీ మాట్లాడిన తీరు సరిగ్గా లేదు అని ఘాటుగా చెప్పారు. తర్వాత, ఆడియన్స్‌తో ఓటింగ్ చేయించగా, 60 మంది మాధురిదే తప్పు అని తేల్చారు. దీంతో ఆమె వద్ద ఉన్న ‘పవర్ స్టోన్’ను షీల్డ్ నుంచి తీసేసారు.

Bigg Boss

నాగార్జున, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌ల వద్ద ఉన్న ‘పవర్ ఆఫ్ నామినేషన్ స్టోన్’ గురించి డిస్కస్ చేశారు. ఆయేషా వద్ద ఉన్న ఈ స్టోన్ గురించి ప్రస్తావిస్తూ, ఆమె తనూజను లేపి, ఆమె అర్హురాలా కాదా అని అడిగారు. తనుజ ‘డిజర్వ్’ అని చెప్పి, “ఆమె రావడమే ఒక టార్గెట్‌తో వచ్చింది” అనగానే, నాగ్ వెంటనే కౌంటర్ వేస్తూ, “ఆమె టార్గెట్ చేసింది నిన్నేగా” అని ప్రశ్నించారు. ఇది తనూజకు దెబ్బ తగిలినట్లు అనిపించింది.

అదేవిధంగా రీతూను లేపి అడగ్గా ఆమె మొదట డిజర్వ్ అంది. కానీ నాగ్ మరింత క్లారిటీగా వివరించి మరోసారి అడగడంతో, రీతూ చివరకు ‘లేదు’ అని చెప్పింది. నిఖిల్ గురించి ఇమ్మాన్యుయేల్‌ను, సాయి గురించి భరణిని ఇలా ఒక్కొక్కరిని లేపి ప్రశ్నించారు. మొత్తం మీద, కొత్త కంటెస్టెంట్లలో కొంతమంది తమ టార్గెటింగ్ పద్ధతిపై పాత వారి నుంచి గట్టిగానే విమర్శలు ఎదుర్కొన్నారు.

ప్రస్తుతం ఆరో వారం ఎలిమినేషన్ రౌండ్‌లో ఓటింగ్ చాలా తక్కువగా పడడంతో.. వారం హౌస్(Bigg Boss) నుంచి రాము రాథోడ్ బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాగార్జున క్లాస్, ఆడియన్స్ ఓటింగ్‌తో ఈ వారం ఎపిసోడ్ ఉత్కంఠగా మారనుంది.

Ind Vs Aus: వన్డే సిరీస్ లో బోణీ ఎవరిదో ?

Exit mobile version