Bigg Boss: ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో ఉన్న ఆ 8 మంది కంటెస్టెంట్స్ వీరే!

Bigg Boss: ఈ వారం కంటెస్టెంట్ల మధ్య మాటల తూటాలు పేలగా, ముఖ్యంగా ఆయేషా జీనత్ , రీతూ చౌదరి మధ్య జరిగిన పర్సనల్ అటాక్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది.

Bigg Boss

బిగ్ బాస్(Bigg Boss) తెలుగు సీజన్ 9 ఏడో వారంలోకి అడుగు పెట్టడంతో, ఎప్పటిలాగే నామినేషన్స్ ప్రక్రియ హోరాహోరీగా జరిగింది. సోమవారం (అక్టోబర్ 20) జరిగిన ఈ ప్రక్రియ ఒక యుద్ధాన్ని తలపించింది. ఈ వారం కంటెస్టెంట్ల మధ్య మాటల తూటాలు పేలగా, ముఖ్యంగా ఆయేషా జీనత్ , రీతూ చౌదరి మధ్య జరిగిన పర్సనల్ అటాక్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది.

ఆయేషా పర్సనల్ అటాక్.. నామినేషన్స్ సందర్భంగా ఆయేషా జీనత్ తన నోటి దురుసును ప్రదర్శించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీతూ చౌదరిని నామినేట్ చేస్తూ ఆమె మాట్లాడుతూ, “ఎందుకే నీకీ ఓవరాక్షన్… అసలు హౌస్‌లో నీ పద్ధతే నచ్చడం లేదు. కేవలం లవ్ ట్రాక్స్ కోసమే బిగ్ బాస్(Bigg Boss) హౌస్‌లోకి వచ్చావ్” అంటూ నీచమైన కామెంట్స్ చేసింది. దీనికి రీతూ చౌదరి కూడా ఏమాత్రం తగ్గకుండా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ నామినేషన్స్ ఎపిసోడ్ మరింతగా డ్రామాను పెంచింది.

నామినేషన్స్ ప్రక్రియ.. ఈ వారం నామినేషన్స్ కోసం బిగ్ బాస్ ఒక ప్రత్యేకమైన టాస్క్ ఇచ్చారు. మొదట, కెప్టెన్స్ అయిన సుమన్ శెట్టి , గౌరవ్ ఇద్దరినీ చెరో పిల్ (Orange, Blue) సెలెక్ట్ చేసుకోమని కోరారు. ఆ పిల్ పవర్‌తో వారు హౌస్‌లోని చెరో వ్యక్తిని సెలెక్ట్ చేసుకునే అవకాశం వచ్చింది, వారికి నామినేట్ చేసే పవర్ లభిస్తుంది.

సుమన్ శెట్టి – ఇమ్మాన్యుయేల్ ను ఎంచుకున్నారు.

గౌరవ్ – ఆయేషా ను ఎంచుకున్నారు.

ఆ తర్వాత, ఇమ్మాన్యుయేల్ , ఆయేషాలకు బెలూన్ టాస్క్ ఇచ్చారు. గదిలో ఉన్న బెలూన్స్‌ను పగలగొట్టి, అందులో ఉన్న నామినేషన్స్ స్లిప్స్‌ను తీసుకోవాలని బిగ్ బాస్ ఆదేశించారు. అలా ఆయేషాకు మూడు స్లిప్స్, ఇమ్మాన్యుయేల్‌కు ఐదు స్లిప్స్ లభించాయి. అందులో ఉన్న పవర్స్‌ని ఎవరితో పంచుకోవాలో వారే నిర్ణయించుకోవాలనే ఆఫర్‌ను బిగ్ బాస్ ఇచ్చారు.

నామినేషన్స్ పవర్ పంచుకోవడం.. ఇమ్మాన్యుయేల్ తన ఐదు స్లిప్స్‌ను కళ్యాణ్, దివ్య నికితా, రమ్య మోక్ష, తనూజ, రీతూ చౌదరి లకు ఒక్కోటి ఇచ్చారు. ఇక ఆయేషా, తన మూడు స్లిప్స్‌లో సంజన, శ్రీనివాస్ ఇద్దరికీ చెరో స్లిప్ ఇచ్చి, మిగిలిన డైరెక్ట్ నామినేట్ చేసే పవర్‌ ఉన్న స్లిప్‌ని మాత్రం తన దగ్గరే ఉంచుకున్నారు.

ఆయేషా తన వద్ద ఉన్న డైరెక్ట్ నామినేషన్ పవర్‌తో రీతూ చౌదరిని నామినేట్ చేసింది. మిగిలిన స్లిప్స్ అందుకున్న కంటెస్టెంట్స్ తోటి హౌస్ మేట్స్‌ను నామినేట్ చేశారు.

ఈరోజు ప్రోమో

ఈ వారం నామినేషన్స్ లిస్ట్.. నామినేషన్స్ ప్రక్రియ ముగిసేసరికి మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ లిస్ట్‌లో చేరారు. వీరిలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీల నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఉండటంతో ఆడిషన్స్ కూడా ఆశ్చర్యపోయారు.

చివరకు ఏడో వారంలో నామినేషన్స్‌లో నిలిచిన కంటెస్టెంట్స్‌గా రీతూ చౌదరి, కళ్యాణ్, తనూజ, రాము, దివ్య, సంజనా, రమ్య మోక్ష, శ్రీనివాస సాయి నిలిచారు. మరి ఈ వీక్ ఊహించని షాకింగ్ ఎలిమేషన్ జరగడంతో వచ్చే వారం ఎవరై ఉంటారా అని ఆడియన్స్ మధ్య చర్చ జరుగుతోంది.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version