Coolie, War 2: బాక్సాఫీస్ ఫైట్..కూలీ, వార్ 2 స్పెషల్ షోస్ టైమింగ్స్, టికెట్ ధరలివే

Coolie, War 2: భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ రెండు సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

Coolie, War 2

స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఈ వారం బాక్సాఫీస్ దగ్గర ఓ మెగా ఫైట్ జరగబోతోందన్నవిషయం తెలిసిందే. రజినీకాంత్ ‘కూలీ’తో పాటు జూనియర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ల ‘వార్ 2’ కూడా ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ రెండు సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీల టికెట్ ధరల పెంపు హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన టికెట్ ధరలు
ఆంధ్రప్రదేశ్‌లో ‘కూలీ’, ‘వార్ 2’ సినిమాలకు అదనపు ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో టికెట్‌పై రూ.75 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 (జీఎస్టీతో కలిపి) పెంచుకోవచ్చు.’కూలీ’ సినిమా విడుదల రోజు ఉదయం 5 గంటలకు అదనపు షోకు కూడా అనుమతి లభించింది.
ఈ కొత్త ధరలు ఆగస్టు 14 నుంచి ఆగస్టు 23 వరకు అమలులో ఉంటాయి. ‘వార్ 2’ సినిమాకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.

Coolie-War 2

తెలంగాణలో టికెట్ రేట్స్ ఇలా..
తెలంగాణలో మాత్రం టికెట్ ధరల పెంపు లేదు. ఇక్కడ సాధారణ ధరలకే సినిమాలు చూడవచ్చు.సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.175కు, మల్టీప్లెక్స్‌ల్లో రూ.295కే టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మార్నింగ్ షో కన్నా ముందు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఒక్క స్పెషల్ షోకు మాత్రమే అనుమతి లభించింది.

తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులు ఈ రెండు భారీ చిత్రాలను చూడటానికి సిద్ధమవుతున్న సమయంలో, ఈ ధరల పెంపు వారికి కొంత ఆసక్తిని కలిగిస్తోంది. ‘కూలీ’ ,’వార్ 2′ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీలు సృష్టిస్తాయో చూడాలి.

 

Exit mobile version