Just EntertainmentLatest News

War 2: వార్ 2తో బాక్సాఫీస్ హీట్.. ఎన్టీఆర్ ఎంట్రీతో రికార్డ్స్ బ్రేక్..

War 2: రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, మొదటిరోజు కలెక్షన్ల పరంగా రూ. 100 కోట్ల మార్క్‌ను ఈజీగా క్రాస్ చేస్తుందని ట్రేడ్ అనలిస్ట్స్ అంచనా వేస్తున్నారు.

War 2

మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2 ఇప్పుడు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో బాలీవుడ్ హిస్టరీలోనే ఒక అన్‌ప్రిసీడెంటెడ్ రికార్డును క్రియేట్ చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుండటంతో, ఫ్యాన్స్ హైప్ మామూలుగా లేదు. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాకు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ స్టైలిష్ ట్రీట్‌మెంట్ ఇచ్చారని టాక్.

వార్ 2 (War 2)ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానుంది. అయితే సినిమా విడుదల తేదీకి నాలుగు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రముఖ బుకింగ్ వెబ్‌సైట్ “బుక్ మై షో” తో పాటు, లోకల్ యాప్స్‌లో కూడా టికెట్లు సూపర్ ఫాస్ట్‌గా బుక్ అవుతున్నాయి.

బుక్ మై షో డేటా ప్రకారం, కేవలం నాలుగు రోజుల్లోనే 7.58 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో రిలీజ్‌కు 4 డేస్ ముందే 750K మార్కును దాటటం రికార్డ్. ఇది ఓపెనింగ్స్ కోసం ఎంత పెద్ద గ్యారంటీ అనేది క్లియర్‌గా అర్థమవుతోంది. ఈ ప్రీ-రిలీజ్ బజ్ చూస్తుంటే సినిమా బాక్సాఫీస్‌పై సూపర్ హిట్ ట్రాక్ పైన ఉన్నట్లు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

War 2 
War 2

ఈ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే, జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీతో సినిమాకు ఒక బిగ్ బూస్ట్ వచ్చినట్లే. సోషల్ మీడియాలో #War2, #NTRinWar2 వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, మొదటిరోజు కలెక్షన్ల పరంగా రూ. 100 కోట్ల మార్క్‌ను ఈజీగా క్రాస్ చేస్తుందని ట్రేడ్ అనలిస్ట్స్ అంచనా వేస్తున్నారు.

మల్టీస్టారర్ కాంబో, ఎనర్జిటిక్ యాక్షన్,మాస్ ఎలిమెంట్స్ వల్ల వార్- 2(War 2) ఒక సాధారణ సినిమా కాదు, అది ఇప్పుడు మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. ఈ భారీ అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల సినిమా విడుదల రోజున రికార్డు బ్రేకింగ్ ఆడియన్స్ రావడం గ్యారంటీ అని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button