Chiranjeevi:చిరు సినిమాకు తెలంగాణ సర్కార్ నుంచీ గ్రీన్ సిగ్నల్..మరి కోర్టు చిక్కుల మాటేంటి?

Chiranjeevi:నిజానికి భారీ బడ్జెట్ సినిమాలకు వెసులుబాటు కల్పించడం కామనే అయినా, నిబంధనల ఉల్లంఘన జరుగుతోందంటూ పదే పదే కోర్టుల వరకూ ఈ విషయం వెళ్లడం పెద్ద సినిమాలకు ఇబ్బందిగా మారుతోంది.

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వగా, తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా మెగాస్టార్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీని ప్రకారం జనవరి 11వ తేదీ రాత్రి 8:30 గంటల నుంచి తెలంగాణలో ప్రీమియర్ షోలు ప్రదర్శించుకోవడానికి తెలంగాణ సర్కార్ కూడా ఓకే చెప్పేసింది. ఈ స్పెషల్ షో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి 600 రూపాయలుగా నిర్ణయించారు.

అలాగే జనవరి 12 నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 100 రూపాయల చొప్పున అదనంగా పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ అదనపు ఆదాయంలో 20 శాతాన్ని సినిమా పరిశ్రమ కార్మికుల సంక్షేమ నిధికి జమ చేయాలని ప్రభుత్వం కండిషన్ విధించింది.

ఇక తాజాగా ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమాకు కూడా ప్రభుత్వం ఇలాగే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చింది. కానీ టికెట్ ధరలను పెంచే అధికారం కేవలం పోలీసు కమిషనర్లకు కానీ జిల్లా కలెక్టర్లకు కానీ ఉంటుందని, హోంశాఖ కార్యదర్శికి ఆ అధికారమే లేదని న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు స్పందించింది.

Chiranjeevi

ఇప్పుడు చిరంజీవి(Chiranjeevi) సినిమాకు కూడా హోంశాఖ నుంచే అనుమతులు రావడంతో, మళ్లీ ప్రజావాజ్యం (PIL) దాఖలయ్యే అవకాశం ఉందనే చర్చ ఫిల్మ్ నగర్ లో నడుస్తోంది. దీనివల్ల బుకింగ్స్ విషయంలో థియేటర్ల యజమానులు , అభిమానులు కొంత ఆందోళన చెందుతున్నారు.

నిజానికి భారీ బడ్జెట్ సినిమాలకు వెసులుబాటు కల్పించడం కామనే అయినా, నిబంధనల ఉల్లంఘన జరుగుతోందంటూ పదే పదే కోర్టుల వరకూ ఈ విషయం వెళ్లడం పెద్ద సినిమాలకు ఇబ్బందిగా మారుతోంది. ఒకవేళ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే, ఈ స్పెషల్ షోలు,పెరిగిన ధరల పరిస్థితి ఏంటనే చర్చ సాగుతోంది. ఏది ఏమయినా ఈ సంక్రాంతి వార్ లో చిరంజీవి(Chiranjeevi) సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని మెగా ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు.

Jagganna Thota Prabhala Theerdham :ఏకాదశ రుద్రుల వైభవం… 400 ఏళ్ల చరిత్ర.. ప్రభల తీర్థం గురించి తెలుసా ?

 

Exit mobile version