Saiyaara : మోహిత్ సూరి డైరెక్షన్లో, కొత్త తరం స్టార్లు అహాన్ పాండే(Ahaan Panday) , అనీత్ పడ్డా(Aneet Padda) హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా ‘సయ్యారా'(Saiyaara) బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను మించి దూసుకుపోతోంది. కేవలం 9 రోజుల్లోనే ఏకంగా రూ. 217.25 కోట్లు వసూలు చేసి, రికార్డు టైమ్‌లో రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ సినిమా ఇప్పుడు లాంగ్ రన్‌లో రూ. 300 కోట్ల మైలురాయిని చేరుకునే దిశగా పరుగులు తీస్తోంది.
Saiyaara
అహాన్ పాండే, అనీత్ పడ్డాకు అదిరిపోయే డెబ్యూని అందించింది. రిలీజ్ అయిన తొమ్మిది రోజుల్లోనే రూ. 217.25 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి, ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. రెండో శనివారం ఈ సినిమా అంచనాలకు మించి రూ. 26.5 కోట్లు వసూలు చేసింది.రెండో వీకెండ్ కేవలం రెండు రోజుల్లోనే రూ. 44.5 కోట్లు వసూలు చేసి, తన బాక్సాఫీస్ బలాన్ని ప్రూవ్ చేసుకుంది.
మొదట్లో ఈ సినిమా లైఫ్‌టైమ్ కలెక్షన్ రూ. 200 కోట్ల వద్ద ఆగిపోతుందని అంచనా వేశారు. కానీ, పాజిటివ్ టాక్, ప్రేక్షకుల మౌత్ టాక్ (Word of Mouth) సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ‘సయ్యారా’ బాక్స్ ఆఫీస్ వసూళ్లకు రీజన్ స్క్రీన్ కౌంట్ పెంచడం, ఇలాంటి స్టోరీ ఉన్న మూవీ బాలీవుడ్‌లో కనిపించకపోవడం కూడా కారణం అంటున్నారు.
ఇప్పుడు ‘సయ్యారా’ రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరడానికి గట్టి పోటీ ఇస్తోంది. 2025లో ఇప్పటివరకు కేవలం విక్కీ కౌషల్ ‘ఛావా’ (రూ. 601 కోట్లు వసూలు చేసింది) మాత్రమే ఈ మార్క్‌ను చేరుకుంది. 2,225 స్క్రీన్లలో రిలైజ్ అయిన మూవీ ఇప్పుడు ఏకంగా 3,650 స్క్రీన్లలో సందడి చేస్తోంది.
ఈ సూపర్ డూపర్ హిట్‌తో , అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్ 5’ని వెనక్కి నెట్టి, ‘సయ్యారా’ ఈ ఏడాదిలో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇది నిజంగా అహాన్, అనీత్‌లకు ఒక డ్రీమ్ డెబ్యూ అనే చెప్పాలి.
కంటెంట్ బాగుంటే చిన్నహీరోనా,పెద్ద హీరోనా అన్నది ఆడియన్స్ ఎప్పుడో మరచిపోయారు. ఇప్పుడు సయ్యారా కూడా అదే ప్రూవ్ చేసింది. మోహిత్ సూరి డైరెక్షన్‌లో వచ్చిన ‘సయ్యారా’ కేవలం బాక్స్ ఆఫీస్ హిట్ ఒకటే కాదు, తక్కువ బడ్జెట్‌తో సుమారు రూ. 40-50 కోట్లతో తెరకెక్కి..ఇప్పటికే రూ. 250 కోట్ల మార్క్‌ని చేరుకుంటోంది. ఇక మున్ముందు ఎలాంటి రికార్డులు కొల్లగొట్టనుందో వెయిట్ అండ్ సీ.