War 2: నాటు నాటు వెర్సస్ ఘుంగ్రూ ..వార్ 2 ప్రమోషన్స్‌లో న్యూ టర్న్

War 2: సినిమా ప్రమోషన్లంటే టీవీ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీటింగ్‌లు మాత్రమే అనుకుంటే పాత కాలం. ఇప్పుడు ప్రమోషన్లు కూడా సినిమాల్లాగే మాస్‌గా, ఫన్‌గా చేస్తున్నారు.

War 2

సినిమా ప్రమోషన్లంటే టీవీ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీటింగ్‌లు మాత్రమే అనుకుంటే పాత కాలం. ఇప్పుడు ప్రమోషన్లు కూడా సినిమాల్లాగే మాస్‌గా, ఫన్‌గా చేస్తున్నారు. ‘వార్ 2’ (War 2)సినిమా హీరోలు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఒకరిపై ఒకరు సరదాగా సవాళ్లు విసురుకుంటూ సినిమాపై బజ్‌ను పెంచుతున్నారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య ‘బిల్ బోర్డ్ యుద్ధం’ సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.

ఇదంతా మొదలైంది ఎన్టీఆర్ వేసిన మాస్ స్టెప్పుతో. ‘వార్ 2′(War 2)లో తన పాత్రకి సంబంధించిన ఒక బిల్‌బోర్డు నేరుగా హృతిక్ ఇంటి ముందు పెట్టించాడు. దానిపై “ఘుంగ్రూ టూట్ జాయేంగే… పర్ హమ్‌సే యే వార్ జీత్ నహీ పావోగే” అని రాసి, స్టైలిష్ ఛాలెంజ్ విసిరాడు. ఇది చూసిన హృతిక్ కూడా నిద్రపోయాడు అని మీరు అనుకుంటే పొరపాటే. వెంటనే కౌంటర్ ఇచ్చాడు.

War-2

ఆస్కార్ గెలిచిన ‘నాటు నాటు’ పాటను గుర్తు చేస్తూ – “మీరు ఎంత నాటు నాటు చేసినా, ఈ వార్‌లో గెలిచేది మాత్రం నేనే” అంటూ హృతిక్ ఎన్టీఆర్‌ ఇంటి ముందు తన బిల్‌బోర్డ్ పెట్టించాడు. దీన్ని చూసిన ఎన్టీఆర్ కూడా ‘నైస్ రిటర్న్ గిఫ్ట్ హృతిక్ సర్’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు.

ఇలా ఒకరిని ఒకరు ఛాలెంజ్ చేస్తూ, ఒకరి సాంగ్‌లను మరొకరు ప్రస్తావిస్తూ, వీళ్ల మధ్‌య ఈ ఫ్రెండ్లీ వార్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్‌ మొదటిసారిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండటంతో, ఇది రెండు ఇండస్ట్రీల క్రేజ్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూపించే సినిమా అవుతోంది. యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో ఈ సినిమా కూడా ఒక భాగం. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా, ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి రాబోతోంది.

Also read: Pushpa incident: పుష్ప ఘటనపై అధికారుల వైఫల్యం.. కమిషన్ ఆగ్రహం

 

Exit mobile version