Pushpa incident: పుష్ప ఘటనపై అధికారుల వైఫల్యం.. కమిషన్ ఆగ్రహం
Pushpa incident: సంధ్య థియేటర్ తొక్కిసలాటపై మానవ హక్కుల కమిషన్ సీరియస్.. ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన నోటీసులు!

Pushpa incident
డిసెంబర్‌లో హైదరాబాదులో జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ గట్టిగా స్పందించింది. ‘పుష్ప 2’ సినిమా ప్రివ్యూ(Pushpa incident) షో కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో సంధ్య థియేటర్ వద్ద అభిమానులు భారీగా చేరడంతో అట్టహాసంగా మారిన వేడుక క్షణాల్లో విషాదంగా మారిపోయింది.
ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ .. తన 10 ఏళ్ల కుమారుడితో కలిసి షో చూడటానికి వెళ్లగా, తొక్కిసలాటలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీ తేజ్ మాత్రం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు.
ఇది కేవలం ప్రేక్షకుల బాధ్యతా రాహిత్యమే కాదు – పోలీస్ అనుమతులు ఎలా వచ్చాయి? భద్రతా ఏర్పాట్లు ఎవరు చూసారు? అనే ప్రశ్నలు మానవ హక్కుల సంఘాన్ని కూడా కదిలించాయి.
పుష్ప 2 అంటేనే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు. అల్లు అర్జున్ స్టైల్, డైలాగ్ డెలివరీ, మేకోవర్‌కి ఫ్యాన్స్ ఫిదా. ఆయన ప్యాన్ ఇండియా ఇమేజ్‌ను క్యాష్ చేసేందుకు మేకర్స్ మదిలో పెట్టుకుని భారీ ప్రమోషన్ ప్లాన్ చేశారు. కానీ ఆ క్రేజ్‌ను నిర్వాహకులు అదుపులో పెట్టకపోవడం వల్లే ఈ తల్లి బలైపోయింది.ఇప్పుడు ఈ కేసులో మానవ హక్కుల కమిషన్ సుమోటోగా చర్యలు తీసుకుంటూ, సంఘటనపై పూర్తి విచారణకు ఆదేశించింది.

ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. బహిరంగ ప్రదర్శనలకు తగిన భద్రతా ఏర్పాట్లు లేకుండా అనుమతులు ఇచ్చిన అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని కమిషన్ అభిప్రాయపడింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ, బాధిత కుటుంబాలకు తక్షణంగా రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, పోలీసుల వైఫల్యంపై పూర్తి నివేదికను సమర్పించాలని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.