Sujeeth: డైరక్టర్ సుజీత్‌కు పవన్ కళ్యాణ్ కానుక.. ఎందుకిచ్చారో తెలుసా?

Sujeeth: సుజీత్ కూడా తనకు పవన్ ఇచ్చిన గిఫ్ట్ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ చాలా భావోద్వేగానికి లోనయ్యారు.

Sujeeth

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నా కూడా, తనను నమ్మి అద్భుతమైన సినిమాను అందించిన దర్శకులను గౌరవించడంలో ఎప్పుడూ ముందుంటారు.

తాజాగా ఆయన తన దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, ఆ చిత్ర దర్శకుడు సుజీత్‌(Sujeeth) కు ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు. సుమారు రెండు కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును సుజీత్‌కు బహుమతిగా అందజేశారు.

దర్శకుడు సుజీత్ (Sujeeth)గురించి చెప్పాలంటే, ఆయన పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. ఓజీ సినిమాను ఆయన కేవలం ఒక దర్శకుడిలా కాకుండా, ఒక అభిమాని తన హీరోను వెండితెరపై ఎలా చూడాలనుకుంటారో అంతకు మించి అద్భుతంగా తెరకెక్కించారు. 2025 సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

Sujeeth

పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో సుజీత్ ప్రెజెంట్ చేసిన విధానం ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చింది. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లింది.

ఈ ఘన విజయం పట్ల పవన్ కళ్యాణ్ చాలా హ్యాపీగా ఉన్నారు. తన ఇమేజ్‌కు తగ్గట్లుగా ఒక క్లాసిక్ హిట్‌ను అందించినందుకు కృతజ్ఞతగా సుజీత్‌కు ఈ లగ్జరీ కారును స్వయంగా వెళ్లి అందించారు. ఈ వార్త తెలియగానే సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

సుజీత్ కూడా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ చాలా భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో ఎంతో మంది నుంచి ఎన్నో బహుమతులు అందుకున్నా కూడా, తన అభిమాన హీరో , నాయకుడి నుంచి అందిన ఈ బహుమతి తన జీవితంలోనే అత్యుత్తమమని ఆయన పేర్కొన్నారు.

కేవలం సినిమా హిట్ అయినందుకే కాదు, సుజీత్ చూపించిన అంకితభావానికి ఫిదా అయిన పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version