The Raja Saab
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఫాంటసీ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్ (The Raja Saab)సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసి.. ఇప్పుడు డిజిటల్ తెరపై అలరించేందుకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు మారుతి మేకింగ్, ప్రభాస్ వింటేజ్ లుక్ , కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్న డార్లింగ్ అభిమానులకు.. జియో హాట్‌స్టార్ సంస్థ తీపి కబురు అందించింది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఈ చిత్రం జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటించారు. సీనియర్ నటులు సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించగా, సప్తగిరి, సత్య వంటి కమెడియన్లు తమ కామెడీతో ఈ చిత్రాన్ని మరింత ఆసక్తికరంగా మార్చారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీ, థియేటర్లలో హారర్ కామెడీ జోనర్‌ను కొత్తగా పరిచయం చేసింది. సంక్రాంతి మూవీలలో అందరినీ అలరించిన ..ది రాజాసాబ్(The Raja Saab), ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. థియేటర్లలో మిస్ అయిన వారు , ప్రభాస్ వింటేజ్ మేజిక్‌ను మళ్లీ చూడాలనుకునే వారు ఫిబ్రవరి 6న రెడీగా ఉండండి..
