NTR-Neel :ఎన్టీఆర్-నీల్ మూవీలో ‘డ్రాగన్’ తాండవం.. హైదరాబాద్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్

NTR-Neel : ఈసారి నీల్..ఎన్టీఆర్ కోసం మునుపెన్నడూ చూడని విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఫైట్ సీన్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

NTR-Neel

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ , సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (NTR-Neel) కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక మూవీ డ్రాగన్ ఇప్పుడు షూటింగ్ పరంగా కీలక దశకు చేరుకుంది. సలార్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న మూవీ కావడంతో, దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన సరికొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో అత్యంత భారీగా వేసిన ఒక సెట్‌లో ప్రారంభమయినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొంటున్నారని, కొన్ని కీలకమైన ఎమోషనల్ సీన్లతో పాటు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను తారక్‌పై ప్రశాంత్ నీల్ (NTR-Neel) తెరకెక్కిస్తున్నారని సమాచారం.

ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో మనందరికీ తెలిసిందే, అయితే ఈసారి ఆయన ఎన్టీఆర్ కోసం మునుపెన్నడూ చూడని విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఫైట్ సీన్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌నే మ్యాగ్జిమమ్ ఫైనల్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ పేరు సినిమా కథాంశానికి , ఎన్టీఆర్ పాత్రకు సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇటీవల నిర్మాత రవి కూడా ఈ మూవీ గురించి మాట్లాడుతూ, విజువల్స్ ,టెక్నికల్ వాల్యూస్ విషయంలో ప్రపంచ స్థాయి నాణ్యతను పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. కేవలం ఎలివేషన్లు, బిల్డప్పులు మాత్రమే కాకుండా, ఈ మూవీలో బలమైన ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంటుందని, ఇది ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంటుందని సినిమా యూనిట్ చెబుతోంది.

NTR-Neel

ప్రశాంత్ నీల్ తన గత సినిమాల కంటే భిన్నంగా ఇందులో సెంటిమెంట్‌కు పెద్ద పీట వేసినట్లు టాక్ నడుస్తోంది.హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే మూవీ టీమ్ విదేశాలకు వెళ్లనుంది. అక్కడ జరిగే తర్వాత షెడ్యూల్‌తో సుమారు టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం తన లుక్ , ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దేవర తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్‌కు ఈ సినిమా అప్‌డేట్స్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో డార్క్ థీమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎన్టీఆర్‌ను ఒక శక్తివంతమైన యోధుడిగా చూపించబోతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నయా రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ఇప్పటికే అంచనా వేసేశాయి. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది స్టార్టింగ్‌లో కానీ ఈ ‘డ్రాగన్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version