Prabhas: డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారా? ప్రభాస్ ఇస్తున్న గోల్డెన్ ఛాన్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి!

Prabhas: మీ దగ్గర మంచి కథ ఉండి, దానిని షార్ట్ ఫిలిం రూపంలో అద్భుతంగా తీయగలిగే ట్యాలెంట్ ఉంటే, మీరు నేరుగా ప్రభాస్ నిర్మాణ సంస్థలో డైరెక్టర్ అయ్యే అవకాశం కూడా లభించొచ్చు.

Prabhas

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas).. ఇప్పుడు ఈ పేరు ఒక గ్లోబల్ బ్రాండ్. ‘బాహుబలి’ నుంచి మొదలుకొని ‘కల్కి’ వరకు వరుస పాన్ ఇండియా విజయాలతో దూసుకుపోతున్న ప్రభాస్, ప్రస్తుతం ‘రాజాసాబ్’ సినిమాతో సంక్రాంతి సందడికి సిద్ధమవుతున్నారు. అయితే ప్రభాస్ కేవలం వెండితెరపైనే హీరో కాదు, నిజజీవితంలో కూడా కొత్తవారికి అవకాశం ఇచ్చే గొప్ప మనసున్న ‘డార్లింగ్’ అని మరోసారి నిరూపించుకున్నారు.

సినిమా ఇండస్ట్రీలోకి రావాలని, డైరెక్టర్ అవ్వాలని కలలు కనే యువత కోసం ప్రభాస్ ఒక అద్భుతమైన వేదికను గతంలోనే సిద్ధం చేశారు. తన అన్న ప్రమోద్‌తో కలిసి ప్రారంభించిన ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ (The Script Craft) సంస్థ ద్వారా ఇప్పుడు ఒక భారీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

Prabhas

గతంలోనే ప్రభాస్ (Prabhas)తన సోషల్ మీడియా ద్వారా ఒక కీలక ప్రకటన చేశారు. కొత్త రచయితలు, కొత్త ఆలోచనలు ఉన్నవారు ఎవరైనా తమ కథలను లేదా సినాప్సిస్‌ను ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయొచ్చని, మంచి కథలు ఉంటే కచ్చితంగా అవకాశం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా మరో అడుగు వేస్తూ, ఈ సంస్థ ద్వారా షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌ను ప్రకటించారు.

దీనికి సంబంధించి తాజాగా విడుదలైన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ‌వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కేవలం ప్రభాస్ మాత్రమే కాకుండా, నేటి తరం సెన్సేషనల్ డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్,హను రాఘవపూడి పాల్గొనడం విశేషం.

ఈ ముగ్గురు దర్శకులు సినిమాల గురించి, అవకాశాల గురించి మాట్లాడుతూ.. కొత్తగా పరిశ్రమలోకి రావాలనుకునే వారు ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌ను ఒక బంగారు అవకాశంగా మలుచుకోవాలని సూచించారు.


ప్రభాస్ లాంటి ఒక గ్లోబల్ స్టార్ స్వయంగా ముందుకు వచ్చి కొత్తవారికి ప్లాట్‌ఫారమ్ ఇస్తున్నారంటే, అందులో ఎంత క్వాలిటీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మీ దగ్గర మంచి కథ ఉండి, దానిని షార్ట్ ఫిలిం రూపంలో అద్భుతంగా తీయగలిగే ట్యాలెంట్ ఉంటే, మీరు నేరుగా ప్రభాస్ నిర్మాణ సంస్థలో డైరెక్టర్ అయ్యే అవకాశం కూడా లభించొచ్చు.

ఈ కాంటెస్ట్‌లో పాల్గొనడం చాలా ఈజీ. ఎవరైనా తమలోని సినిమా ట్యాలెంట్‌ను ప్రపంచానికి చూపించాలనుకుంటే, ఈ కింద ఉన్న అధికారిక లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు: [https://www.thescriptcraft.com/register/director]

మీరు తీసిన షార్ట్ ఫిలిం బాగుండి, మీ విజన్ ప్రభాస్ టీమ్‌కు నచ్చితే, భవిష్యత్తులో పెద్ద సినిమాలకు దర్శకత్వం వహించే ఛాన్స్ మీ తలుపు తట్టొచ్చు. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక అవకాశం రావాలంటే ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాలి.

కానీ ప్రభాస్(Prabhas) ఈ ట్రెండ్‌కు చెక్ పెట్టి, టాలెంట్ ఉంటే చాలు మీ వద్దకే అవకాశం వస్తుందని నిరూపిస్తున్నారు. ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయంపై సినీ వర్గాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఒక స్టార్ హీరోగా బిజీగా ఉంటూనే, సినిమా రంగం పట్ల తనకున్న మక్కువతో కొత్త తరానికి బాటలు వేయడం నిజంగా గొప్ప విషయం అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరెందుకు ఆలస్యం? మీ దగ్గర కెమెరా లేదా మంచి ఫోన్ ఉంటే, ఒక మంచి పాయింట్ పట్టుకుని షార్ట్ ఫిలిం తీసి ప్రభాస్(Prabhas) కాంటెస్ట్‌లో పాల్గొనండి. మీ కలల ప్రయాణానికి ప్రభాస్ ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ తొలి అడుగు కావాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్..

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version