Kingdom : విజయ్ ఎమోషనల్, అనిరుధ్ తెలుగు స్పీచ్.. మూవీ హైప్ పెంచేశారుగా !

Kingdom : జులై 31న వస్తున్న కింగ్‌డమ్ మూవీ .. బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి.

Kingdom : మీరు నాకు దేవుడిచ్చిన వరం అంటూ ఫ్యాన్స్‌కు హార్ట్ ఫుల్ థ్యాంక్స్ చెప్పాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. సినిమా హిట్టైనా, ఫ్లాపైనా.. తన వెంట నడిచే లక్షలాది మంది ఫ్యాన్స్ అజేయమైన ప్రేమకు, వారి ట్రస్ట్‌కి సెల్యూట్ అంటూ.. విజయ్ ఎమోషనల్ అయ్యాడు. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానుల ఉత్సాహం చూసి.. ఎమోషనల్ అయిపోయాడు.

Kingdom

ఈ ట్రైలర్ చూశాక, ఈసారి మనం హిట్ కొడుతున్నాం..మన సినిమా టాప్‌లో ఉందని అభిమానులు అన్నారని విజయ్ గుర్తు చేశాడు. నీకు హిట్ వస్తుందని ఎవరూ అనలేదు.. అందరూ మనకు అనడం చూసి నా గుండె నిండిపోయిందంటూ విజయ్ ఆనందంగా చెప్పుకొచ్చాడు. ఈ అసాధారణ ప్రేమే తన అసలైన స్ట్రెంత్ అని, కింగ్‌డమ్(Kingdom) తన సినిమా కాదని, అది గౌతమ్, అనిరుధ్, టీమ్, ముఖ్యంగా అభిమానుల ‘హార్ట్’ లోంచి పుట్టిన సినిమా అని అన్నాడు.

మంచి సినిమా ఇచ్చామన్న శాటిస్‌ఫాక్షన్ ఉందని విజయ్ దేవరకొండ అన్నాడు. దాదాపు రెండు వేల మందిని కలిశానని, వారందరూ “అన్నా, ఈసారి మనం హిట్ కొడుతున్నాం అనే అన్నారని, అందుకే ప్రతి సినిమాకు సోల్ పెట్టి పనిచేస్తానని హామీ ఇచ్చాడు. మీరందరూ నా నుంచి ఆశించిన ఆ హిట్.. కింగ్‌డమ్‌తో రాబోతుందని కన్ఫిడెంట్‌గా చెప్పగానే యూసఫ్‌గూడ గ్రౌండ్ చీర్స్‌తో దద్దరిల్లింది. గౌతమ్ తిన్ననూరి, అనిరుధ్, నవీన్ నూలి, నాగవంశీ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ సహా టీమ్ అంతా ప్రాణం పెట్టి పనిచేశారంటూ కితాబిచ్చాడు విజయ్.

తర్వాత ఈ ఈవెంట్లో ..అనిరుధ్ రవిచందర్ తన పవర్‌ఫుల్ స్పీచ్‌తో ఈవెంట్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్ళాడు. ఫ్లూయెంట్‌గా తెలుగులో మాట్లాడుతూ అందరినీ మెస్మరైజ్ చేశాడు. విజయ్ అద్భుతమైన యాక్టరే కాదు, అంతకుమించిన మంచి హ్యూమన్ బీయింగ్. నేను ఈ సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు.. మనకి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్, సరిపడా స్లీప్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటున్నావా?’ అని విజయ్ నాకు మెసేజ్ పంపాడు. అంత గొప్పది విజయ్ హార్ట్!” అని అనిరుధ్ విజయ్ లోని కొత్త యాంగిల్‌ను ఫ్యాన్స్‌కు ఇంట్రడ్యూస్ చేశాడు.

ఈ సినిమా విజయ్ కెరీర్‌కు మాత్రమే కాదు.. నా కెరీర్‌కు, గౌతమ్ కెరీర్‌కు, నాగవంశీ కెరీర్‌కు ఒక మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని అనిరుధ్ చెప్పాడు. ట్రైలర్‌కు వచ్చిన స్పందన, బుకింగ్స్‌లో కనిపిస్తున్న జోష్.. అన్నీకింగ్‌డమ్ విజయానికి సిగ్నల్స్ అని అన్నారు. తెలుగు ప్రేక్షకుల కోసం ఇది మాదో కొత్త ఎఫర్ట్, సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. మీ లవ్ ఎప్పుడూ నాపై ఇలాగే ఉండాలంటూ అనిరుధ్ ఎమోషనల్‌గా ముగించాడు.
మొత్తంగా  జులై 31న వస్తున్న కింగ్‌డమ్ మూవీ .. బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి.

 

Exit mobile version