Top Movies: ఛావా నుంచి కూలీ వరకు..2025లో టాప్ మూవీస్ కలెక్షన్ రిపోర్ట్

Top Movies: పెద్ద సినిమాలు కూడా భారీ కలెక్షన్స్‌ను రాబట్టలేకపోయాయి. దీనిని బట్టి హీరోల కంటే స్టోరీలో దమ్ముందా లేదా అన్నదే ఆడియన్స్ చూస్తున్నారని అర్ధం అవుతోందని సినీ క్రిటిక్స్ అంటున్నారు.

2025 సంవత్సరం భారతీయ సినిమాకి ఒక విభిన్నమైన ఏడాదిగా నిలిచింది. భారీ బడ్జెట్ సినిమాలు ఆశించిన స్థాయిలో బ్లాక్‌బస్టర్లుగా నిలవలేకపోయినప్పటికీ, కొన్ని ప్రత్యేక చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించాయి.

2025లో టాప్ 5 అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలను చూసుకుంటే.. ఛావా (Chhaava) విక్కీ కౌశల్ నటించిన ఈ హిస్టారికల్ డ్రామా ఈ ఏడాది బాక్సాఫీస్ ఛాంపియన్‌గా నిలిచింది. రూ. 130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్షరాలా రూ. 808.7 కోట్లు వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ సినిమా కథాబలం, నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

Top Movies-chaavaa

సైయారా (Saiyaara) తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, అద్భుతమైన కథాంశంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎనిమిది నెలల పాటు థియేటర్లలో విజయవంతంగా నడిచి ప్రపంచవ్యాప్తంగా రూ. 542.4 కోట్ల వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Top Movies-Saiyaara

కూలీ (Coolie) సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ చిత్రం విడులైన తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 441.3 కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది. దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడం విశేషం.

Top Movies-coolie

వార్ 2 (War 2) ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి అగ్ర నటులు కలిసి నటించిన ఈ యాక్షన్ సినిమా ప్రస్తుతం రూ. 300 కోట్ల మార్కును దాటి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో నాలుగో స్థానంలో ఉంది.కాగా హౌస్ఫుల్ 5 (Housefull 5).. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ కామెడీ చిత్రం రూ.292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి టాప్ 5లో చోటు సంపాదించుకుంది.

War 2

ఈ ఐదు సినిమాలతోపాటు, మోహన్‌లాల్ నటించిన ఎంపురాన్, అమీర్ ఖాన్ ఫిల్మ్ సితారే జమీన్ పర్, సంక్రాంతికి వస్తున్నాం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. సంక్రాంతికి వస్తున్నాం ప్రత్యేకంగా రూ, 300 కోట్ల మార్కును అధిగమించడం విశేషం.

2025లో భారీ బ్లాక్‌బస్టర్లు లేకపోవడం, బడా సినిమాలు కూడా అనుకున్నంతగా విజయం సాధించలేకపోవడం కూడా గమనించాలి. ఛావా, సైయారా వంటి సినిమాలు కథాబలంతోనే విజయం సాధించగా, కూలీ, వార్ 2 వంటి పెద్ద సినిమాలు కూడా భారీ కలెక్షన్స్‌ను రాబట్టలేకపోయాయి. దీనిని బట్టి హీరోల కంటే స్టోరీలో దమ్ముందా లేదా అన్నదే ఆడియన్స్ చూస్తున్నారని అర్ధం అవుతోందని సినీ క్రిటిక్స్ అంటున్నారు.

Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి మరో మాస్టర్ మైండ్..హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తాడా

Exit mobile version