Just EntertainmentBigg BossLatest News

Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి మరో మాస్టర్ మైండ్..హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తాడా

Bigg Boss: అభిజీత్ ఒక తెల్లటి చార్ట్‌పై బొమ్మ గీయమని చెప్పి, బొమ్మ ముఖంపై తన చేతిలోని రెడ్ ర్‌ను వేయకుండా చూసుకోవాలని సవాలు విసిరాడు.మార్క

Bigg Boss

బిగ్ బాస్ అగ్నిపరీక్ష కంటెస్టంట్‌లకు నిజంగానే అగ్నిపరీక్ష పెడుతుంది. అయితే కొంతమంది ఆడియన్స్‌ను, జడ్జిలను సో సో గా ఆకట్టుకుంటుంటే మరికొందరు మాత్రం ఎంట్రీలోనే అదరగొడుతున్నారు. ఈరోజు జరిగిన ఎపిసోడ్‌లో మనీష్ అనే కంటెస్టెంట్ తన అద్భుతమైన తెలివితేటలతో న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ప్రముఖ వ్యాపారవేత్త, ఫోర్బ్స్ జాబితాలో 33వ స్థానంలో ఉన్న మనీష్.. బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించడానికి వచ్చాడు. బిగ్ బాస్‌లో మాస్టర్ మైండ్‌గా పేరు తెచ్చుకున్న అభిజీత్ కూడా మనీష్ తెలివికి ఆశ్చర్యపోయాడు.

నవదీప్, బిందు మాధవి మనీష్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, అభిజీత్ మాత్రం అతడిని ఒక కఠినమైన పరీక్షకు గురిచేశాడు. అభిజీత్ ఒక తెల్లటి చార్ట్‌పై బొమ్మ గీయమని చెప్పి, బొమ్మ ముఖంపై తన చేతిలోని రెడ్ మార్కర్‌ను వేయకుండా చూసుకోవాలని సవాలు విసిరాడు. అందుకు మనీష్ చాలా తెలివిగా బొమ్మకు ముఖమే లేకుండా చేసి, ‘ముఖం లేకపోతే మీరు రెడ్ మార్క్ వేయలేరు కదా’ అని బదులిచ్చాడు. ఈ సమాధానానికి జడ్జీలంతా వావ్ అంటూ ఆశ్చర్యపోయారు. అభిజీత్ కూడా మనీష్ తెలివిని మెచ్చుకున్నాడు.

Bigg Boss
Bigg Boss

అయితే, ఇంత తెలివి ఉన్నా మనీష్‌కు రెడ్ ఫ్లాగ్ ఇచ్చి ఇంకొక రౌండ్ తర్వాత నిర్ణయం తీసుకుంటానని అభిజీత్ చెప్పడానికి ప్రధాన కారణం మనీష్ బ్యాక్‌గ్రౌండే కావచ్చు. మనీష్ ఒక పెద్ద వ్యాపారవేత్త కావడం, అత్యున్నత ప్రొఫైల్ కలిగి ఉండడం వల్ల అతనికి బిగ్ బాస్‌(Bigg Boss)లో ప్రవేశం వెంటనే ఇవ్వడానికి అభిజీత్ కొంత సంకోచించి ఉండొచ్చు.

సాధారణంగా, బిగ్ బాస్(Bigg Boss) లాంటి షోలలో సామాన్య ప్రజలకు అవకాశం ఇవ్వాలని జడ్జీలు భావిస్తారు. అలాగే, ఒకవేళ మనీష్ హౌస్‌లోకి వెళ్లినా, తన వ్యాపార సంబంధాలు, అనుభవంతో గేమ్ ఆడడంలో ఇతర కంటెస్టెంట్లకు ఇబ్బంది ఎదురవుతుందా అని అభిజీత్ ఆలోచించి ఉండవచ్చు. ఏదేమైనా, మనీష్ తెలివి మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అభిజీత్ కూడా మెచ్చిన ఈ మాస్టర్ మైండ్.. బిగ్ బాస్(Bigg Boss) హౌస్‌లోకి అడుగుపెడతాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Trump: భారత్‌కు అమెరికా రాయబారిగా ట్రంప్ పర్సనల్ ఫ్రెండ్ .. భారత్‌కు లాభమా, నష్టమా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button