Pawan Kalyan:‘ఉస్తాద్ భగత్ సింగ్’ న్యూ లుక్ .. పవన్ కళ్యాణ్ బర్త్‌డే ట్రీట్ అదిరింది..

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుంచి ఒక స్టైలిష్ కొత్త లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూసిన తర్వాత, అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు పండగ వాతావరణం నెలకొంది. సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజు సందర్భంగా, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుంచి ఒక స్టైలిష్ కొత్త లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూసిన తర్వాత, అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినీ కెరీర్‌లో ఒక సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఒక బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం పవన్ అభిమానులకు ఒక గొప్ప విందుగా మారింది. పవన్ కళ్యాణ్‌ను హరీష్ శంకర్ తెరపై చూపించిన తీరు, ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు ఫుల్ ఎనర్జీనిచ్చింది.

ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా మెరుగ్గా ఉందని ప్రముఖ దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ కూడా ప్రశంసించారు. అందుకే, ఈ అద్భుతమైన కాంబినేషన్ మళ్లీ కలిసినప్పుడు, అంచనాలు తారాస్థాయికి చేరడం సహజం. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అందరూ నమ్ముతున్నారు.

Pawan Kalyan

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ విడుదల చేసిన కొత్త లుక్ అభిమానుల అంచనాలను మరింత పెంచింది. ఈ లుక్‌లో పవన్ కళ్యాణ్ ఒక డ్యాన్స్ బీట్ లుక్‌లా కనిపిస్తున్నారు. ఇది సినిమాలోని ఒక ఎనర్జిటిక్ పాటను సూచిస్తున్నట్లుగా ఉంది. పవన్‌ని అత్యంత శక్తివంతంగా, స్టైలిష్‌గా ఎలా చూపించాలో హరీష్ శంకర్‌కు బాగా తెలుసునని ఈ పోస్టర్ మరోసారి రుజువు చేసిందన్న టాక్ నడుస్తోంది.

తమిళ చిత్రం ‘తెరి’కి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను హరీష్ శంకర్ తనదైన శైలిలో మార్పులు చేసి, ఒక కొత్త లుక్ తీసుకొస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీలీల మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాశీ ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది విడుదల చేయాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పవన్ కళ్యాణ్ ఒక గొప్ప విందు అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

Ants: మనుషుల్లాంటి చీమలు..వీటి గురించి వింటే నివ్వెరపోతారు

Exit mobile version