OG movie:ఓజీ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో విజయవాడ ఉత్సవ్ ..ఈవెంట్ ప్లాన్ అదిరిందిగా

OG movie:సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 'విజయవాడ ఉత్సవ్' పేరుతో పెద్ద ఎత్తున ఈవెంట్స్ ప్లాన్ చేశారు.

OG movie

దసరా ఫెస్టివల్స్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విజయవాడ సిటీకి కొత్త గ్లోరీ తీసుకొస్తోంది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ‘విజయవాడ ఉత్సవ్’ (OG movie)పేరుతో పెద్ద ఎత్తున ఈవెంట్స్ ప్లాన్ చేశారు. పన్నెండేళ్ల తర్వాత మళ్లీ విజయవాడలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వడం ఈ ఉత్సవానికి ఒక స్పెషల్ ఫీచర్. ఈ ఫెస్టివల్ మెయిన్ ఎయిమ్ టూరిజం సెక్టార్‌కి బూస్ట్ ఇవ్వడం, దానితో పాటు విజయవాడను ఒక ప్రముఖ టూరిస్ట్ డెస్టినేషన్‌గా ప్రమోట్ చేయడం.

ఈ మెగా ఈవెంట్స్‌ను ప్రముఖ ఫిల్మ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ శ్రేయాస్ మీడియా హ్యాండిల్ చేస్తోంది. ఈ ఫెస్టివల్స్ విజయవాడలోని కృష్ణా రివర్ బ్యాంక్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గొల్లపూడిలో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ స్టేడియం లాంటి మల్టిపుల్ వేదికల్లో కంటిన్యూగా 11 రోజులు జరుగుతాయి. ఈవెంట్ ప్లానింగ్ మొత్తం చాలా పర్ఫెక్ట్‌గా ఉంది.

OG movie

ఈ ఉత్సవ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్​ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారనుంది. సెప్టెంబర్ 22న ఈ ఈవెంట్‌తోనే విజయవాడ ఉత్సవ్ గ్రాండ్‌గా స్టార్ట్ కానుంది. విజయవాడలో పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మెగా ఈవెంట్ అభిమానులను మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలను కూడా పెద్ద సంఖ్యలో అట్రాక్ట్ చేయనుంది. ఈ ఒక్క ఈవెంట్ నగరానికి కొత్త ఎనర్జీ, జోష్ తీసుకురావడమే కాకుండా, మిగతా పది రోజుల ఈవెంట్స్‌కు కూడా భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు.

విజయవాడ ఉత్సవ్‌లో వాటర్ స్పోర్ట్స్, ఫ్లోట్ పరేడ్, డ్రోన్ షో, కిడ్స్ జోన్స్, అమ్యూజ్‌మెంట్స్, ఫుడ్ స్టాల్స్ లాంటివి స్పెషల్ అట్రాక్షన్స్. ఇవి కాకుండా, సినిమా, మ్యూజికల్ నైట్స్, కల్చరల్ పెర్ఫార్మెన్సెస్, స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఈ ఫెస్టివల్‌లో పార్ట్. ఈ ఈవెంట్ విజయవాడ సిటీని ఒక ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చనుంది.

ఈ ఉత్సవం ద్వారా గవర్నమెంట్‌కి ఫైనాన్షియల్ , టూరిజం వైజ్‌గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫెస్టివల్‌కి వచ్చే సందర్శకుల సంఖ్య పెరిగితే, లోకల్ బిజినెస్‌లు, హోటల్స్, రెస్టారెంట్లు ,ట్రాన్స్‌పోర్ట్ డెవలప్ అవుతాయి. ఇది సిటీకి కొత్త ఐడెంటిటీ తీసుకురావడంలో హెల్ప్ చేస్తుంది. టూరిజం డిపార్ట్‌మెంట్‌కి కూడా ఇది ఒక బిగ్ విక్టరీగానే చెప్పొచ్చు.

Raw coconut: పచ్చికొబ్బరి పోషకాల నిధి.. కానీ వారికి కాదు

Exit mobile version