Kangana Ranaut
బాలీవుడ్ నటి, లోక్‌సభ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపారు. డేటింగ్ యాప్‌లు, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు యువతతో పాటు సంప్రదాయవాదులను కూడా ఆలోచింపజేస్తున్నాయి. ఆమె తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పడంలో ఎప్పుడూ ముందుంటారు, ఈసారి కూడా అదే చేశారు. డేటింగ్ యాప్‌లను ఆమె సమాజపు డ్రైనేజీ (గటర్)గా అభివర్ణించారు. ఆ యాప్‌లలో సరైన భాగస్వామి దొరకడని, జీవితంలో ఏమీ సాధించని వారే వాటిని వాడతారని ఘాటుగా విమర్శించారు.
కంగనా(Kangana Ranaut) ప్రకారం, నిజమైన బంధాలు ఏర్పడాలంటే సహజమైన వాతావరణంలోనే అవి సాధ్యమవుతాయి.ఆఫీసుల్లో, కాలేజీలలో, లేదా పెద్దలు కుదిర్చే వివాహ సంబంధాలలోనే మంచి రిలేషన్‌షిప్‌లు తయారవుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ వివాహ వ్యవస్థకు మద్దతు ఇస్తూ, డేటింగ్ యాప్‌లను ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదని ఆమె అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని అనుకరించడం వల్ల దేశంలో అనేక సమస్యలు వస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.
కేవలం డేటింగ్ యాప్‌లే కాకుండా, లివ్-ఇన్ కల్చర్‌పైనా కంగనా(Kangana Ranaut) ఫైర్ అయ్యారు. ఇది మహిళలకు అస్సలు సురక్షితమైన సంస్కృతి కాదని ఆమె గట్టిగా చెప్పారు. ఒకవేళ లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో మహిళ గర్భం ధరించి, ఆ తర్వాత భాగస్వామి వదిలి వెళ్లిపోతే ఆమె పరిస్థితి ఏమవుతుందని ఆమె ప్రశ్నించారు. పెళ్లి అనే వ్యవస్థలో కుటుంబం, చట్టబద్ధమైన ఒప్పందం ఉండడం వల్ల మహిళలకు భద్రత, ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తాయని, లివ్-ఇన్ కల్చర్‌లో అవి ఉండవని చెప్పుకొచ్చారు.
Also Read: Chicken : మీరు రోజూ చికెన్ తినే బ్యాచేనా? అయితే అర్జంటుగా ఆపేయండి
కంగనా (Kangana Ranaut)గతంలో కూడా బాలీవుడ్‌లో నెపోటిజంపై విమర్శలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తన వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు, గత సంబంధాల గురించి కూడా ఆమె బహిరంగంగా మాట్లాడారు. తాజాగా ఎంపీగా ఎన్నికైన ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంతో, బదేశంలోని సంప్రదాయవాదులు ఆమెను సమర్థిస్తుండగా, కొంతమంది ఆమె అభిప్రాయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా, ఆమె మాటలు మరోసారి దేశంలో సామాజిక చర్చకు దారితీశాయి.