Students:విద్యార్థులూ ఈ స్కాలర్షిప్ అందుకోండి..లాస్ట్ డేట్ దగ్గర పడుతోంది
Students:ఈ స్కాలర్షిప్ మొత్తం ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఇతర ఖర్చులకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, మొత్తం స్కాలర్షిప్లలో 30 శాతం అమ్మాయిలకు కేటాయించడం ఈ పథకం యొక్క మరో ముఖ్యమైన అంశం.

Students
దేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. ‘పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీం ఫర్ వైబ్రంట్ ఇండియా’ (PM YASASVI) పేరుతో కొత్త స్కాలర్షిప్లను ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన, వెనుకబడిన వర్గాల (ఓబీసీ, ఈబీసీ, డీఎన్బీ) విద్యార్థులకు ప్రీమియం స్థాయి విద్యను అందిస్తుంది. ఈ స్కీమ్ కింద 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.1,25,000 వరకు స్కాలర్షిప్ను అందించనున్నారు.
ఈ స్కాలర్షిప్ మొత్తం ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఇతర ఖర్చులకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, మొత్తం స్కాలర్షిప్లలో 30 శాతం అమ్మాయిలకు కేటాయించడం ఈ పథకం యొక్క మరో ముఖ్యమైన అంశం. విద్యార్థులు(students) ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆగస్టు 31లోగా తమ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.

స్కాలర్షిప్ పూర్తి వివరాలు, అర్హతలు ఏంటంటే..ఈ పథకంలో స్కాలర్షిప్ మొత్తం తరగతిని బట్టి మారుతుంది.9, 10వ తరగతి విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.75,000 వరకు స్కాలర్షిప్ లభిస్తుంది.11, 12వ తరగతి విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.1,25,000 వరకు స్కాలర్షిప్ లభిస్తుంది.
అభ్యర్థులను గత తరగతిలో వారు సాధించిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఓబీసీ, ఈబీసీ, డీనోటిఫైడ్ ట్రైబల్ వర్గాలకు చెందినవారై ఉండాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించకూడదు.
ఈ స్కాలర్షిప్ కేవలం ఎంపిక చేసిన టాప్ క్లాస్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థుల(Students)కు మాత్రమే వర్తిస్తుంది. విద్యార్థుల వయసు 9వ తరగతికి 13 నుంచి 15 సంవత్సరాలు, 10వ తరగతికి 14 నుంచి 16, 11వ తరగతికి 15 నుంచి 17, మరియు 12వ తరగతికి 16 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
దరఖాస్తుతో పాటు కొన్ని ముఖ్యమైన పత్రాలు సమర్పించాలి.అవి..కుల, కుటుంబ, ఆదాయ ధ్రువపత్రాలు,గత తరగతి మార్కుల మెమో, ఆధార్ నంబర్ అలాగే విద్యార్థి బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి. అంతేకాదు పాఠశాల నోడల్ ఆఫీసర్ ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాలి.
ఈ స్కాలర్షిప్ పథకం ప్రతిభావంతులైన విద్యార్థులకు (Students)ఉన్నత విద్యను అభ్యసించడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ పథకం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి, అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
One Comment