Fish wheelchair: ఒక చేప..దాని వీల్ చైర్ కథ!

Fish wheelchair: అది మనిషి అయినా, జంతువు అయినా, చివరికి నీటిలో ఈదే ఒక చిన్న చేప అయినా... ఇప్పుడు అలాంటి ఓ చేప కథే మనం తెలుసుకుందాం.

Fish wheelchair

ఒక్కోసారి బయట కనిపించే బాధలకు చలించేవారు చాలామంది ఉంటారు. కానీ, దాన్ని సరిదిద్దడానికి కొద్దిమంది మాత్రమే ఆలోచిస్తారు. సమస్య చిన్నగానే కనిపించవచ్చు, కానీ ఆ కష్టాన్ని అనుభవించే వారికి అది ఒక కొత్త జీవితాన్ని ఇచ్చినట్లే అవుతుంది. అది మనిషి అయినా, జంతువు అయినా, చివరికి నీటిలో ఈదే ఒక చిన్న చేప అయినా… ఇప్పుడు అలాంటి ఓ చేప కథే మనం తెలుసుకుందాం.

ఇంటర్నెట్‌లో రోజుకు వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. కానీ కొన్ని వీడియోలు మాత్రం మన హృదయాలను హత్తుకుంటాయి. ప్రస్తుతం అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Fish wheelchair

ఒక అక్వేరియం మేనేజర్ తన దగ్గర ఉన్న ఒక గోల్డ్ ఫిష్‌ కోసం చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ చేపకు ‘స్విమ్ బ్రాడర్’ అనే వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి కారణంగా చేప నీటిలో బ్యాలెన్స్ కోల్పోయింది. దాని వల్ల అది నీటిలోకి మునిగిపోవడం లేదా నీటిపై తేలిపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిలో అది ఎక్కువ రోజులు జీవించలేదు. దాంతో దానికి సాయం చేయాలని మేనేజర్ నిర్ణయించుకున్నాడు.

Fish wheelchair

ఆ చేపకు సహాయం చేయడానికి ఆ మేనేజర్ ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. కొన్ని జిప్ టైల్స్, ప్లాస్టిక్ ట్యూబింగ్, చిన్న చిన్న స్టైరోఫామ్ ముక్కలతో ఒక చిన్న వీల్‌చైర్‌ని తయారు చేశాడు. దానిని జాగ్రత్తగా చేప చుట్టూ అమర్చాడు. ఇది చేపకు నీటిలో ఆసరాగా నిలిచింది. దీంతో ఆ చేప సాధారణంగా ఈత కొట్టగలిగింది.ఈత కొట్టలేని చేపకు వీల్‌చైర్ (fish wheelchair) అమర్చడం ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.

మనసు మంచిదైతే ఏదైనా చేయొచ్చు.. నిస్సహాయంగా ఉన్న జీవికి మనం తోడుగా నిలబడొచ్చు. దీనికి క్రియేటివిటీ, కేరింగ్, పక్కవారి గురించి ఆలోచించే మైండ్ సెట్ తోడయితే.. తక్కువ ఖర్చుతో కూడా జంతువుల సంక్షేమాన్ని మెరుగుపరచవచ్చని మేనేజర్ నిరూపించాడు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎంతోమంది ఈ వీడియో చూసి ఆ మేనేజర్‌ను అభినందిస్తున్నారు.

NTR: ఎన్టీఆరే కాదు తారక్ ఫ్యాన్స్ కూడా సెన్సేషనే.. ఎందుకలా అంటారా?

Exit mobile version