K visa
అమెరికా అధ్యక్షుడు గత కొన్ని నెలలుగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చమురు కొనుగోలు విషయంలో తమతో విభేదించినందుకు భారత్ ను టార్గెట్ చేసుకున్న ట్రంప్ ఆ విధంగానే ముందుకు వెళుతున్నారు. సుంకాల పెంపు ఇదే కోవలోకి వస్తుంది. ఇప్పుడు హెచ్1 బి వీసాకు లక్ష డాలర్ల ఫీజును పెంచడం కూడా ట్రంప్ అక్కసులో భాగమే. ఈ నిర్ణయాలతో భారత్ ను ఇబ్బందిపెడుతున్నామంటూ అమెరికా తెగ సంబరపడుతోంది. అయితే అదే సమయంలో రష్యా, చైనా దేశాలకు భారత్ దగ్గరైందన్న విషయం మరిచిపోతోంది.
ట్రంప్ సంచలన నిర్ణయాలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న చైనా భారత్ కు మేలు చేసేలా వ్యవహరిస్తోంది. ట్రంప్ కొత్తగా తీసుకొచ్చిన వీసా ఫీజు పెంపు నిర్ణయానికి కౌంటర్ గా డ్రాగన్ కంట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. K వీసా(K visa)ను ప్రవేశపెట్టింది. అక్టోబర్ 1 నుంచి K వీసా అందుబాటులోకి రానుండగా.. ప్రపంచవ్యాక్తంగా ఉన్న గ్లోబల్ టాలెంట్ కోసమే ఈ వీసాను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.
ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ రంగాలలో టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ ను ఎంకరేజ్ చేయడమే ఈ K వీసా ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. కానీ ట్రంప్ నిర్ణయాలకు కౌంటర్ గా , భారత టెకీలు, ఇతర రంగాల నిపుణులకు అవకాశాలు కల్పించేందుకే చైనా ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ పర్ట్స్ అంచనా ప్రకారం K వీసా(K visa) యూఎస్ హెచ్1బి వీసాకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెబుతున్నారు.
ట్రంప్ కొత్తగా వీసాలు అప్లై చేసుకునేవారికి ఫీజు లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో K వీసా (K visa)ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. నిజానికి ట్రంప్ గతంలో తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా ఈసారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. అయితే అమెరికాలోనే ట్రంప్ నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశాలపై తమ ఆధిపత్యమే ఉండాలన్న ధోరణితోనే ఇలా చేస్తున్నాడన్నది అందరికీ తెలిసింది. అదే సమయంలో ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకు మేలు కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.
నిజానికి మన దేశం నుంచి సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ ఎక్కువ మంది ఎంచుకునే మొదటి దేశం అమెరికానే.. టాప్ కంపెనీలన్నీ అక్కడే ఉండడం , డాలర్లలో సంపాదించాలనే కోరిక వంటివి అమెరికాకు వెళ్ళేందుకు కారణాలుగా చెప్పొచ్చు. గతంలో ట్రంప్ కంటే ముందున్న ప్రెసిడెంట్స్ ఎవ్వరూ కూడా హెచ్1 బి వీసాలపై పెద్దగా ఆంక్షలు విధించిన సందర్భాలు లేవు. కానీ ట్రంప్ ఈ వీసాల జారీ విషయంలో ఎక్కువ ఆంక్షలు విధించి భారత్ టెకీలకు అడ్డుకట్ట వేయాలనుకోవడమే కాదు… మన దేశంపై ఆధిపత్యం చెలాయించాలని భావిస్తున్నాడు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం కూడా ధీటుగానే స్పందిస్తుండడంతో భవిష్యత్తులోనూ ట్రంప్ మరికొన్ని నిర్ణయాలతో భారత్ ను ఇబ్బంది పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.