America Delta
వేరే దేశపు అధ్యక్షుడిని బందీగా పట్టుకోవడం ఇంత ఈజీనా.. అమెరికా వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను బంధించిన తర్వాత చాలా మందికి వచ్చిన అనుమానం ఇదే. వెనిజులా అధ్యక్షుడు అత్యంత భద్రత మధ్య ఉండే భవనంలోకి వెళ్లి 10 నిమిషాల్లోనే ఆయన్ని అదుపులోకి తీసుకోవడం అమెరికా సత్తాకు నిదర్శనం.
ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అమెరికా ఆర్మీ గురించే.. వారిని అమెరికా ఆర్మీగా చెప్పలేం. ఎందుకంటే అత్యంత శక్తివంతమైన వ్యవస్థ అది. ఈ వ్యవస్థ పేరు డెల్టా ఫోర్స్ (America Delta).. పేరులోనే కాదు రియాలిటీలోనూ ఫోర్స్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇది అమెరికా రక్షణరంగంలో ఒక నిశ్శబ్ద ఆయుధంగా చెబుతారు. (America Delta) డెల్టా ఫోర్స్ చేసే ఆపరేషన్లు యుద్ధ గమనాన్నే మార్చేస్తుంటాయి.. నికోలస్ మదురోను నిమిషాల వ్యవధిలో బంధించడం ద్వారా తన సత్తాను మరోసారి ప్రపంచ దేశాలకు డెల్టా ఫోర్స్ చాటిచెప్పింది. దీంతో డెల్టా ఫోర్స్ గురించి తెలుసుకునేందుకు అందరూ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వీరి గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.
సాధారణంగానే ఆర్మీ సిబ్బందికి ఇచ్చే ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుంది. ఇక డెల్టా ఫోర్స్ లాంటి పకడ్బందీ ఫోర్సులోకి అడుగుపెట్టాలంటే దానికి పదిరెట్లు కఠినమైన శిక్షణ తీసుకోవాల్సిందే. అలాగే అత్యాధునిక టెక్నాలజీ వీరి ప్రధాన బలం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ కలిగి ఉన్న దేశాల్లో అమెరికానే టాప్. వారి శక్తికి ప్రధాన కారణం ఈ డెల్టా ఫోర్స్. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఫోర్స్ గానూ, ఘోస్ట్ ఆర్మీగానూ దీనికి పేరుంది.
1977లో కల్నల్ చార్లెస్ బెక్విత్ డెల్టా (America Delta) ఫోర్స్ ను స్థాపించారు. బ్రిటీష్ ఎలైట్ ఫోర్స్ తరహాలోనే దీని ట్రైనింగ్ , వ్యూహాలు అత్యంత పకడ్బందీగా ఉంటాయి. ఉగ్రవాదాన్ని అణిచివేయడం, బందీలకు విముక్తి కలిగించడం వంటి కీలక బాధ్యతలను ఈ డెల్టా ఫోర్స్ తీసుకుంటుంది. అమెరికాకు ముప్పు కలిగిస్తారని అనుమానం నిజమైతే చాలు అలాంటి వారిని తుదముట్టిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలతో బంధిస్తుంటుంది. అలాగే విదేశాల్లో బందీలుగా చిక్కుకున్న అమెరికన్లను అత్యంత రహస్యంగా రక్షించడం కూడా ఈ డెల్టా ఫోర్స్ ప్రధాన బాధ్యతగా ఉంది.
గతంలో చాలా కీలక ఆపరేషన్లను అత్యంత విజయవంతంగా పూర్తి చేసిన ఘనత డెల్టా ఫోర్స్ కు ఉంది. భూగర్భ గృహంలో దాక్కొని ఉన్న ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను బయటకు వెలికితీసింది. ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్-బగ్దాదీని సిరియాలో మట్టుబెట్టింది కూడా డెల్టా ఫోర్సే. లాడెన్ ను మట్టుపెట్టడంలోనూ ఈ ఘోస్ట్ ఆర్మీనే కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని పట్టుకుని మరోసారి తన సత్తా నిరూపించుకుంది.
Bhogapuram Airport :ఉత్తరాంధ్ర మణిహారం భోగాపురం ఎయిర్ పోర్ట్..దీని వల్ల విశాఖకు కలిసొచ్చే అంశాలేంటి?
