Earthquake: జపాన్‌ను వణికించిన భూకంపం.. సునామీ హెచ్చరికలు

Earthquake: జపాన్‌లో భూకంపాలు రావడం కొత్తేమీ కాదు. చాలా తరచుగా వస్తుంటాయి. 2011 మార్చిలో భూకంపం కారణంగా వచ్చిన సునామీతో జపాన్ తీవ్రంగా నష్టపోయింది.

Earthquake

ఇటీవల కాలంలో ప్రకృతి వైపరీత్యాల దెబ్బకు పలు దేశాలు వణుకుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు కొన్ని దేశాలను అతలాకుతలం చేస్తే.. భూకంపాలు(Earthquake) కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జపాన్ ను భారీ భూకంపం వణికించింది. ఉత్తర జపాన్ లోని ఇవాటే ప్రావిన్స్ లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

భూకంపం భారీస్థాయిలో ఉండడంతో ఫసిఫిక్ తీరంలో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్టు జపాన్ మెట్రాలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. సునామీ హెచ్చరికల సందర్భంగా ఉత్తర తీరం సహా సముద్రంలో 3 మీటర్ల వరకూ అలలు ఎగిసిపడే అవకాశం ఉందని తెలిపింది. సునామీ వచ్చే అవకాశం ఉందని, ప్రజలు సముద్ర తీరాలకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే భూకంపం తీవ్రత కారణంగా జపాన్ లోని పలు సముద్ర తీరాల్లో అల్లకల్లోల వాతావరణం నెలకొంది. , మియాకో, కమైషి, కుజీ, ఒమినాటో వంటి చోట్ల అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి, మరోవైపు, భూకంపం కారణంగా బుల్లెట్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.

Earthquake

చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. సునామీ అలలు ప్రభావం గంటల తరబడి కొనసాగవచ్చని అధికారులు వెల్లడించారు. వాటి తీవ్రత కూడా పెరిగే అవకాశముందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జపాన్‌లో భూకంపాలు రావడం కొత్తేమీ కాదు. చాలా తరచుగా వస్తుంటాయి. 2011 మార్చిలో భూకంపం కారణంగా వచ్చిన సునామీతో జపాన్ తీవ్రంగా నష్టపోయింది.

ఏకంగా అణురియాక్టర్ దెబ్బతిని, పెద్ద ఎత్తున రేడియేషన్ విడుదలవడం తీవ్ర కలకలం రేపింది. అప్పట్లో అణురియాక్టర్ ను కూడా మూసేశారు. మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందేమోనంటూ అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. కాగా తాజా భూకంపం, తదనంతర పరిణామాలపై జపాన్ ప్రధాని సనాయె తకైచి ట్విట్టర్ లో స్పందించారు. సునామీ హెచ్చరికలు జారీ చేశామనీ, ఎవ్వరూ కూడా సముద్ర తీరాలకు వెళ్దొద్దని కోరారు. భూకంప ప్రకంపనలు కూడా మళ్లీ వచ్చే అవకాశముందని హెచ్చరించారు.

ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా కోరారు. అయితే అణు విద్యుత్ కేంద్రంలో ఎలాంటి నష్టం నమోదు కాలేదని, ఎవ్వరూ ఆందోళన చెందొద్దని కోరారు. పలు చోట్ల పరిస్థితిని బట్టి విద్యుత్ సేవలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాని తకైచి వెల్లడించారు.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version