Weird laws
ఒక దేశంలో నవ్వకపోయినా జైలు శిక్ష, మరో చోట పావురాలకు తిండి పెడితే నేరం, ఇంకొక దేశంలో గ్రూప్‌గా జాగింగ్ చేస్తే జీవిత ఖైదు. ఇలాంటి చట్టాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? చట్టాలంటే సమాజం బాగుండటానికి, ప్రజల భద్రత కోసం ఉండే రూల్స్ అని మనకు తెలుసు. కానీ, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మన ఊహకు కూడా అందని విచిత్రమైన చట్టాలు(Weird laws) ఉన్నాయి. ఆశ్చర్యకరంగా అనిపించే అలాంటి కొన్ని వింత చట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం
విచిత్రమైన చట్టాలు(Weird laws), వాటి వెనుక కారణాలు
- మసాచుసెట్స్, ఇంగ్లాండ్.. ఇక్కడ స్నానం చేయకుండా నిద్రపోతే చట్ట విరుద్ధం. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చట్టం పెట్టారు.
- సమోవా (ఐలాండ్).. భార్య పుట్టినరోజును భర్త మర్చిపోతే అది నేరం. మహిళల హక్కులకు ప్రాధాన్యత ఇస్తూ ఈ చట్టాన్ని రూపొందించారు.
- స్విట్జర్లాండ్.. రాత్రి 10 గంటల తర్వాత బాత్రూంలో ఫ్లష్ చేస్తే జరిమానా విధిస్తారు. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడమే దీని ఉద్దేశం.
- శాన్ఫ్రాన్సిస్కో, ఇటలీ, వెనీస్.. ఇక్కడ పావురాలకు ఆహారం ఇవ్వడం నేరం. ఇందుకు కారణం పావురాల వల్ల నగరంలో పరిశుభ్రత సమస్యలు తలెత్తుతున్నాయి. వెనీస్‌లో పావురాల రెట్టలను శుభ్రం చేయడానికి ఒక్కో పౌరుడిపై భారీ ఖర్చు పడుతోందట.
- సింగపూర్.. చూయింగ్ గమ్ల తయారీ, అమ్మకం నిషేధం. నగరాన్ని శుభ్రంగా ఉంచడానికి ఈ చట్టం తీసుకొచ్చారు.
- నార్త్ కొరియా.. బ్లూ కలర్ జీన్స్ ధరిస్తే నేరంగా పరిగణించబడుతుంది. ఈ నియమం పశ్చిమ దేశాల సంస్కృతిని ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో పెట్టారు.
- మిలాన్, ఇటలీ.. ఇక్కడ బహిరంగంగా నవ్వుతూ ఉండాలి. లేకపోతే జరిమానా. ఆసుపత్రి లేదా అంత్యక్రియలకు వెళ్లేవారికి మినహాయింపు ఉంది. ఈ చట్టం నగరంలో సానుకూల వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది.
- శ్రీలంక..బుద్ధుడి విగ్రహాలతో సెల్ఫీలు దిగడం అగౌరవంగా భావిస్తారు.
- బురుండి (మధ్య ఆసియా).. గ్రూప్‌గా జాగింగ్ చేయడం నిషేధం. ఇది విద్రోహ చర్యలకు దారితీస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఒంటరిగా జాగింగ్ చేసేవారికి అనుమతి ఉంది.
- విక్టోరియా, ఆస్ట్రేలియా.. గాలిపటాలను ఎగరవేయడం, బహిరంగ ప్రదేశాల్లో ఆటలు ఆడటం నిషేధం. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఈ నియమాలు పెట్టారు.
- ఓక్లహోమా, అమెరికా.. కుక్కను చూసి చీదరించుకుంటే జైలు శిక్ష పడుతుంది.