Hair mask: జుట్టు నిగనిగలాడాలంటే.. ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి..
Hair mask:కాలుష్యం, నీటి సమస్యలు, లేదా హైదరాబాద్ లాంటి నగరాల్లో హెల్మెట్ వాడకం వల్ల కూడా జుట్టు రాలే సమస్య వస్తుంది. దీనికి పరిష్కారం మన వంటింట్లోనే ఉంది.

Hair mask
ఈ రోజుల్లో జుట్టు రఫ్, డ్రైగా మారడం సర్వసాధారణ సమస్యగా మారింది. కాలుష్యం, నీటి సమస్యలు, లేదా హైదరాబాద్ లాంటి నగరాల్లో హెల్మెట్ వాడకం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. దీనికి పరిష్కారం మన వంటింట్లోనే ఉంది. అదే ‘బనానా హెయిర్ మాస్క్’. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుని, మీ జుట్టుకు కొత్త మెరుపు తీసుకురావచ్చు.
హెయిర్ మాస్క్(Hair mask) తయారు చేసే విధానం
ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి..బాగా పండిన అరటిపండు, 2 స్పూన్ల హెన్నా పౌడర్, 1 టీ స్పూన్ కాఫీ పౌడర్, 1 కప్పు పెరుగు, 1 స్పూన్ ఆవాల నూనె

ఈ పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి మెత్తని పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గంటసేపు పక్కన పెట్టిన తర్వాత, మీ జుట్టుకు మాస్క్‌లా అప్లై చేసి 30 నిమిషాల పాటు ఉంచి, తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ హెయిర్ మాస్క్(Hair mask) వల్ల కలిగే ప్రయోజనాలు
పెరుగు: జుట్టులో ప్రోటీన్, తేమ లోపాన్ని తొలగిస్తుంది. జుట్టును బలంగా, ఒత్తుగా చేస్తుంది.
కాఫీ పౌడర్, హెన్నా: ఇవి జుట్టుకు సహజమైన రంగును ఇస్తాయి. అలాగే, జుట్టుపై ఒక షైనింగ్ కోటింగ్ ఇస్తాయి.
అరటి పండు: ఇందులో ఉండే ప్రోటీన్లు ఎండకు దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేసి, మృదువుగా మార్చుతాయి.
ఆవాల నూనె: జుట్టుకు తేమను అందిస్తుంది. కుదుళ్లలో బ్యాక్టీరియాను నివారించి, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
ఈ హెయిర్ మాస్క్ వాడటం వల్ల మీ జుట్టు నిగనిగలాడుతూ, ఆరోగ్యంగా మారుతుంది.
One Comment