India-Japan: భారత్-జపాన్ మైత్రి..మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ విజన్!

India-Japan:ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థపై సుంకాలు విధించి, దాన్ని నిష్క్రియ ఆర్థిక వ్యవస్థ (dead economy) అని అభివర్ణించిన సందర్భంలో, జపాన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

India-Japan

టోక్యోలోని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్(India-Japan) ప్రధాని షిగేరు ఇషిబా నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చసాగుతోంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థపై సుంకాలు విధించి, దాన్ని నిష్క్రియ ఆర్థిక వ్యవస్థ (dead economy) అని అభివర్ణించిన సందర్భంలో, జపాన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తమ పెట్టుబడుల లక్ష్యాన్ని ఏకంగా రెట్టింపు చేసి, భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తమకున్న అపార విశ్వాసాన్ని చాటిచెప్పింది. ప్రధాని మోదీ రెండు రోజుల జపాన్ పర్యటనలో ఈ మైత్రి సరికొత్త శిఖరాలను అధిరోహించింది.

భారత్-జపాన్(India-Japan) గతంలో 2026 నాటికి 5 ట్రిలియన్ యెన్ (సుమారు 34 బిలియన్ డాలర్లు) పెట్టుబడుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. కానీ, ఈ లక్ష్యం 2025 నాటికే పూర్తయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో జపాన్ ఆ లక్ష్యాన్ని ఏకంగా 10 ట్రిలియన్ యెన్‌లకు (సుమారు 68 బిలియన్ డాలర్లు) పెంచింది. ఈ భారీ పెట్టుబడుల వెనుక కేవలం సంఖ్యలు మాత్రమే కాకుండా, భారత ఆర్థిక వృద్ధిపై జపాన్‌కు ఉన్న తిరుగులేని నమ్మకం కనిపిస్తోంది.

ఈ రెండేళ్లలో దాదాపు 170కి పైగా అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి. ఈ పెట్టుబడులు ఒక్క రంగానికే పరిమితం కాకుండా, విమానయానం, ఆటోమొబైల్, ఉక్కు, పునరుత్పాదక ఇంధనాలు, సెమీకండక్టర్లు, రియల్ ఎస్టేట్ వంటి అన్ని రంగాల్లోకి విస్తరించాయి. నిప్పన్ స్టీల్ గుజరాత్‌లో 15 బిలియన్ రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 56 బిలియన్ రూపాయలు పెట్టుబడి పెట్టగా, సుజుకి మోటార్ గుజరాత్‌లో భారీగా 350 బిలియన్ రూపాయలు, టయోటా కిర్లోస్కర్ కర్ణాటక, మహారాష్ట్రలలో 233 బిలియన్ రూపాయల పెట్టుబడులు పెట్టాయి. ఇది భారత ఆర్థిక భవిష్యత్తుపై జపాన్‌కు ఉన్న నమ్మకానికి నిదర్శనం.

India-Japan

ఈ మైత్రి పట్టణాలకు మాత్రమే పరిమితం కాలేదు. జపాన్ సహకారం నేరుగా భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల దిశగా అడుగులు వేస్తోంది. సోజిట్జ్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 30 బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ల కోసం రైతులు పంట వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలను సరఫరా చేసి అదనపు ఆదాయం పొందనున్నారు. అంతేకాకుండా, సుజుకి మోటార్ కార్పొరేషన్, నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) తో కలిసి గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో నాలుగు బయోగ్యాస్ ప్లాంట్లను ప్రారంభించింది. ఇవి ఆవు పేడను బయోగ్యాస్‌గా మార్చి, కాలుష్యం లేని సీఎన్‌జీ వాహనాలకు ఇంధనంగా అందిస్తాయి. ఈ ప్రాజెక్టులు రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు, దేశ ఇంధన స్వావలంబనకు దోహదం చేస్తాయి.

జపాన్ సంస్థలు కేవలం పెట్టుబడులు పెట్టడానికే కాకుండా, భారతీయ చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (SMEs) అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాయి. ఉదాహరణకు, టోక్యో ఎలక్ట్రాన్, ఫ్యూజిఫిల్మ్ సంస్థలు టాటా ఎలక్ట్రానిక్స్‌తో కలిసి భారతదేశంలో సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మిస్తున్నాయి. దీనిలో భారతీయ ఎస్ఎంఈలు కీలకమైన భాగాలను సరఫరా చేయనున్నాయి. అలాగే, టయోటా, సుజుకి వంటి సంస్థలు వందలాది భారతీయ ఎస్ఎంఈలను తమ సరఫరా వ్యవస్థలో భాగం చేసుకోనున్నాయి. ఇది భారతీయ ఎస్ఎంఈలకు ప్రపంచ ప్రమాణాలు, ఆధునిక సాంకేతికత, అంతర్జాతీయ మార్కెట్‌కు మార్గాన్ని సుగమం చేస్తుంది.

ఈ భాగస్వామ్యం మానవ వనరుల రంగంలోనూ ఒక కొత్త శకానికి తెరతీసింది. ‘ఇండియా-జపాన్(India-Japan) టాలెంట్ బ్రిడ్జ్’ కార్యక్రమం కింద రాబోయే ఐదేళ్లలో 5 లక్షల మంది భారతీయ, జపనీస్ యువతకు విద్య, ఉద్యోగం, ఇంటర్న్‌షిప్‌ల ద్వారా పరస్పర మార్పిడికి అవకాశం కల్పించనున్నారు. ఐఐటీ గౌహతి, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐఎస్సీ బెంగళూరు వంటి ప్రముఖ భారతీయ యూనివర్సిటీలలో కెరీర్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. సెమీకండక్టర్లు, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి కీలక రంగాలపై ఈ కార్యక్రమాలు దృష్టి పెడతాయి. జపాన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాల కోసం 15 బిలియన్ యెన్‌ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇది జపాన్‌లో ఉన్న కార్మిక కొరతను తీర్చడంతో పాటు, భారతీయ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు అందిస్తుంది.

ఈ బంధం కేవలం ఈ రెండు దేశాల ప్రయోజనాలకే పరిమితం కాలేదు. “మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” అనే నినాదం ఇప్పుడు జపాన్ భాగస్వామ్యంతో ఒక వాస్తవంగా మారుతోంది. జపాన్ జాయింట్ వెంచర్లు భారతదేశంలో అత్యాధునిక ఉత్పత్తులను తయారు చేసి, వాటిని ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతి చేయనున్నాయి. టయోటా, సుజుకి కంపెనీలు భారతదేశంలో తయారయ్యే హైబ్రిడ్, ఈవీ వాహనాలను ఎగుమతి చేయనున్నాయి. నిప్పన్ స్టీల్ ప్రత్యేకమైన స్టీల్‌ను ఉత్పత్తి చేయనుండగా, ఫ్యూజిఫిల్మ్-టాటా భాగస్వామ్యం గ్లోబల్ చిప్ సరఫరా వ్యవస్థలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తుంది.

EQ: ఐక్యూ కంటే కూడా ఈక్యూ ఇంపార్టెంట్ అని తెలుసా?

Exit mobile version