Miss Universe 2025
థాయ్‌లాండ్‌లో అత్యంత వైభవంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్-2025(Miss Universe 2025) గ్రాండ్ ఫినాలేలో, మెక్సికో దేశానికి చెందిన అందగత్తె ఫాతిమా బాష్ (Fatima Bash) విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. 121 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలు పాల్గొన్న ఈ మహా పోటీలో, ఫాతిమా అత్యద్భుతంగా రాణించింది. ఈ విజయంతో మెక్సికో దేశం నాలుగోసారి మిస్ యూనివర్స్ (Miss Universe 2025)టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.
25 ఏళ్ల ఫాతిమా బాష్, మెక్సికోలోని తబాస్కో (Tabasco) రాష్ట్రం నుంచి మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి మహిళగా ప్రత్యేక గౌరవాన్ని దక్కించుకుంది. టాప్-5లో డెన్మార్క్, నైజీరియా, థాయిలాండ్, వెనిజులా దేశాల సుందరీమణులతో పాటు నిలిచిన ఫాతిమా, ఫైనల్ రౌండ్‌లో తన సత్తా చాటింది.
ఫాతిమా ఈవనింగ్ గౌన్ (Evening Gown) , ప్రశ్నోత్తరాల విభాగాలలో (Question and Honors Segments) అదరగొట్టి, న్యాయనిర్ణేతల నుంచి ప్రశంసలు అందుకుంది.
జడ్జీలు అడిగిన చివరి ప్రశ్నకు ఫాతిమా ఇచ్చిన సమాధానం ఆమెకు కిరీటాన్ని తెచ్చిపెట్టింది. ఆమె “నమ్మకం (Faith), ధైర్యం (Courage), ప్రేమ (Love) ఇవే నా జీవిత స్తంభాలు” అని స్పష్టం చేసింది, ఇది ఆమె ఆత్మవిశ్వాసాన్ని, దృఢత్వాన్ని ప్రదర్శించింది.
ఈ ప్రతిష్టాత్మక పోటీలో మిగిలిన స్థానాల్లో నిలిచినవారు..థాయ్‌లాండ్‌కు చెందిన ప్రవీణర్ సింగ్ (Praveenar Singh) తొలి రన్నరప్‌గా నిలిచింది.వెనిజువెలాకు చెందిన స్టిఫానీ అబాసలీ (Stephanie Abasali) రెండో రన్నరప్‌గా నిలిచింది.
భారత్ తరఫున రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ (Manika Vishwakarma) ఈ అంతర్జాతీయ పోటీలో పాల్గొంది. ఆమె తన అద్భుతమైన ప్రదర్శనతో మొదట్లో టాప్-30లోకి ప్రవేశించగలిగింది. అయితే, తర్వాత రౌండ్‌లో ఆమె టాప్-12లోకి రాలేకపోయింది, దీంతో మణిక పోటీ నుంచి ఎలిమినేట్ అయింది. అయినా, అంతర్జాతీయ వేదికపై మణిక చూపించిన ప్రతిభను అంతా మెచ్చుకున్నారు.
