February 14th: మనసు గెలిచే వేడుక వచ్చేస్తోంది.. ప్రేమ కానుకలివే..

February 14th Day gift ideas for couples

February 14th

ప్రేమను వ్యక్తపరచడానికి మాటలు చాలనప్పుడు, మనసులోని మాటలు చెప్పలేనపుడు ఆ పనిని కానుకలు పూర్తి చేస్తాయి. ఫిబ్రవరి 14(February 14th)న తమ మనుసులోని ఇష్టాన్ని చెప్పలేనపుడు గిఫ్టులను ఆశ్రయిస్తుంటారు. ఆరోజు ఇచ్చే గిఫ్ట్ కేవలం వస్తువు మాత్రమే కాదు, అది మీ భాగస్వామిపై వారికున్న ఇష్టానికి ఒక నిదర్శనం.

ఈ రోజున ప్రత్యేకంగా ఎరుపు రంగుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎర్రటి గులాబీలు ప్రేమకు చిహ్నం అయితే, హార్ట్ షేప్ బెలూన్స్ వారిద్దరి మధ్య ఉన్న వాతావరణాన్ని మరింత రొమాంటిక్‌గా మారుస్తాయి.

ఈ మధ్య కాలంలో కేవలం బొకేలు మాత్రమే కాకుండా, చాక్లెట్ బొకేలు కూడా ట్రెండ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా డార్క్ చాక్లెట్స్ ఒత్తిడిని తగ్గించి మూడ్‌ను హ్యాపీగా మారుస్తాయని సైన్స్ చెబుతోంది, కాబట్టి ఆరోజు ప్రేమికులు ఒకరికొకరు చాక్లెట్లు ఇచ్చుకుంటారు.

ఇక గిఫ్ట్‌ల విషయానికి వస్తే, ఇప్పుడు పర్సనలైజ్డ్ కానుకలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంటే మీరు కలిసి దిగిన ఫోటోతో కానీ, వారి ఫేవరేట్ ఫోటో కానీ కాఫీ మగ్గులు, ఫోటో ఫ్రేమ్‌లు లేదా మీ పేర్లు చెక్కిన బ్రేస్‌లెట్స్ వంటివి అవతలి వ్యక్తికి వారిపై ఉన్న ప్రేమను పదే పదే గుర్తు చేస్తాయి.

February 14th

ఇక కేక్స్ విషయానికి వస్తే, రెడ్ వెల్వెట్ కేక్ వాలెంటైన్స్ డే స్పెషల్. ఆ ఎరుపు, తెలుపు రంగుల కలయిక ప్రేమకు ప్రతిరూపంలా ఉంటుంది. కేవలం ఖరీదైన వస్తువులనే కాకుండా, వారు స్వయంగా రాసిన ఒక చిన్న ప్రేమ లేఖను ఆ గిఫ్ట్‌తో పాటు ఇస్తే, ఆ జ్ఞాపకం జీవితాంతం నిలిచిపోతుంది.

అలంకరణ కోసం ఎర్రటి హార్ట్ షేప్ బెలూన్స్, క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తే వాలెంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14న అద్భుతంగా మారుతుందంటారు ప్రేమికులు.

New Baggage Rules:విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్త బ్యాగేజీ రూల్స్ వచ్చేసాయ్..

Exit mobile version