sea :సముద్ర గర్భంలో 95% రహస్యాలు ఇంకా మిస్టరీనే

sea: సముద్రం కేవలం ఒక జలరాశి మాత్రమే కాదు, అది నిత్యం మనల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో రహస్యాలను, అద్భుతాలను తనలో దాచుకున్న ఒక అనంత ప్రపంచం.

sea: సముద్రం కేవలం ఒక జలరాశి మాత్రమే కాదు, అది నిత్యం మనల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో రహస్యాలను, అద్భుతాలను తనలో దాచుకున్న ఒక అనంత ప్రపంచం. మన భూమిలో ఎక్కువ భాగం నీరే ఆవరించి ఉంది. అందులోనూ సముద్రాల విస్తీర్ణమే అత్యధికం. భూమి పైన ఏం జరుగుతుందో మనకు తెలిసినంతగా, సముద్ర అంతర్భాగం(deep sea)లో ఏమి జరుగుతుందో తెలియదు. ఇప్పటి వరకు మానవాళికి సముద్రాల గురించి కేవలం 5% మాత్రమే తెలుసు. మిగిలిన 95% ఇంకా మిస్టరీగానే ఉంది. చూడటానికి ప్రశాంతంగా కనిపించే ఈ కడలిలో ఎన్ని రహస్యాలు, అద్భుతాలు దాగి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కడలిలో దాగిఉన్న  రహస్యాలు, అద్భుతాలు

1. అపారమైన బంగారు నిల్వలు

సముద్ర గర్భంలో కొన్ని వేల టన్నుల బంగారం నిక్షిప్తమై(gold reserves) ఉందని మీకు తెలుసా? సముద్రాల లోపల పెద్ద పెద్ద కొండలు, అనేక గనులు కూడా ఉన్నాయి. పూర్వకాలంలో సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో బంగారం, వజ్రాలు నిండిన పడవలు ప్రమాదవశాత్తు మునిగిపోయాయి. అవన్నీ సముద్రపు అడుగున కలిసిపోయాయి. ఒక అంచనా ప్రకారం, ఈ బంగారాన్ని బయటకు తీయగలిగితే, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ సుమారు నాలుగు కిలోల బంగారం ఇవ్వవచ్చట. ఇది సముద్రం ఎంత సంపదను దాచుకుందో తెలియజేస్తుంది.

2. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం

ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ఏదైనా ఉందా అంటే అది నిస్సందేహంగా సముద్రమే. వందల ఏళ్ల క్రితం వచ్చిన సునామీలు, భూకంపాలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎన్నో పురాతన నగరాలు, రాజ్యాలు సముద్రంలో మునిగిపోయాయి. ఈ మునిగిపోయిన నగరాల్లో విగ్రహాలు, పురాతన కళాఖండాలు, చారిత్రక అవశేషాలు అలాగే ఉండిపోయాయి. ఇవి కాకుండా, మనిషి ఎప్పుడూ చూడని వింత జంతువులు, ప్రమాదకరమైన చేపలు వంటి జీవులు కూడా సముద్ర అంతర్భాగంలో జీవిస్తున్నాయి. ఇవన్నీ సముద్రాన్ని ఒక జీవన మ్యూజియంగా మార్చాయి.

3. మంచినీటి గనులు – ఐస్‌బర్గ్‌లు

సముద్రపు నీరు ఉప్పగా ఉంటుందని, తాగడానికి పనికిరాదని మనకు తెలుసు. అయితే, కడలి లోపల ఉండే ఐస్‌బర్గ్‌లు (మంచు పర్వతాలు) మాత్రం 100% స్వచ్ఛమైన మంచినీటిని కలిగి ఉంటాయి. ఒక అంచనా ప్రకారం, ఒక పెద్ద ఐస్‌బర్గ్‌ను కరిగించగలిగితే, పది లక్షల మందికి ఐదు సంవత్సరాల వరకు త్రాగునీటిని అందించవచ్చట. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆ ఐస్‌బర్గ్‌ల పరిమాణం ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి. భవిష్యత్తులో మంచినీటి కొరతను తీర్చడానికి ఇవి ఒక పరిష్కారంగా మారే అవకాశం ఉంది.

4. ఇంటర్నెట్ సేవలకు గుండెకాయ

మనం నిత్యం ఉపయోగించే ఇంటర్నెట్ సేవలు కూడా సముద్రం లోపల వేసిన భారీ కేబుళ్ల (Submarine Cables) ద్వారానే ప్రపంచానికి అందుతున్నాయి. శాటిలైట్ ద్వారా అందించే ఇంటర్నెట్ కన్నా, సముద్రం లోపల కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ అందించడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అందుకే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం డేటా ట్రాఫిక్సముద్ర కేబుళ్ల ద్వారానే జరుగుతుంది. ఇది సముద్రం మన రోజువారీ జీవితంలో ఎంత కీలక పాత్ర పోషిస్తుందో చెబుతోంది.

Exit mobile version