Trump: చైనాకు ట్రంప్ బిగ్ షాక్ 100 శాతం సుంకాల మోత

Trump:నవంబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త టారిఫ్ లు అమల్లోకి రానున్నాయి. అరుదైన ఖనిజాల ఎగుమతుల విషయంలో చైనా తీసుకున్న చర్యలపై ట్రంప్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) కు కోపం వచ్చిందంటే ఏదో దేశానికి షాక్ తగిలినట్టే… గత కొన్నిరోజులుగా ట్రంప్ విషయంలో ఇదే తంతు నడుస్తోంది. భారత్ పై సుంకాల మోత పెంచుతూ, హెచ్1బి వీసాల ఫీజు పెంచేసి తన అక్కసు తీర్చుకున్న ట్రంప్ ఇప్పుడు చైనాను టార్గెట్ చేశారు. డ్రాగన్ కంట్రీకి షాకిస్తూ ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా పలు ఆంక్షలు విధించడమే ట్రంప్ ఆగ్రహానికి కారణం. అంతేకాదు షి జిన్‌పింగ్‌తో జరగాల్సిన శిఖరాగ్ర సమావేశాన్ని సైతం రద్దు చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరో రెండు వారాల్లో దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్(Trump) భేటీ కావాల్సి ఉంది. కానీ తాజా పరిణామాల తర్వాత వీరి భేటీ జరిగే అవకాశాలు లేనట్టే. ఇదే విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకొచ్చారు. జిన్ పింగ్ తో సమావేశానికి సరైన కారణం కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించారు. ఇంతకుముందే 30 శాతం సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు దానిని 100 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Trump

నవంబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త టారిఫ్ లు అమల్లోకి రానున్నాయి. అరుదైన ఖనిజాల ఎగుమతుల విషయంలో చైనా తీసుకున్న చర్యలపై ట్రంప్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని తాను ఊహించలేదని, వాళ్ళే తనకు కోపం తెప్పించారంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. మాదకద్రవ్యాల బిజినెస్ కు మద్ధతుగా నిలుస్తుందన్న కారణంతోనే ట్రంప్(Trump) గతంలో చైనాపై 30 శాతం టారిఫ్ లు విధించారు. ఇప్పుడు అరుదైన ఖనిజాల ఎగుమతుల విషయంలో ఆంక్షలు అమెరికా ప్రెసిడెంట్ ఆగ్రహానికి కారణమయ్యాయి.

సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇంధన సాంకేతికతతో సహా కీలకమైన తయారీ రంగాలకు అరుదైన ఖనిజాల అవసరం ఎంతో ఉంటుంది. ఈ ఈ ఖనిజాల ప్రపంచ ఉత్పత్తిలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. దీన్ని గుర్తు చేస్తూనే.. చైనా ప్రపంచాన్ని బందీగా ఉంచడానికి అనుమతించకూడదంటూ ట్రంప్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే ట్రంప్ నిర్ణయంపై ఇటు చైనా నుంచి ఇప్పటి వరకూ స్పందన లేదు. అయితే ట్రంప్ 100 శాతం టారిఫ్ విధించాలన్న నిర్ణయం స్టాక్ మార్కెట్లపై మాత్రం గట్టిగా ప్రభావం చూపించాయి. ఈ నేపథ్యంలో చైనా అరుదైన ఖనిజాల విషయంలో ఆంక్షలను వెనక్కి తీసుకుంటుందా లేక ట్రంప్ నిర్ణయానికి కౌంటర్ గా ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version