Kitchen:వంటగది ఏ మూల ఉండాలో తెలుసా?

Kitchen: వంట చేసేటప్పుడు తూర్పు ముఖంగా నిలబడి చేసేలా ఉండాలి. గ్యాస్ స్టవ్ ఆగ్నేయంలో, సింక్ (నీటి కొళాయి) ఈశాన్యంలో ఉండాలి. ఎందుకంటే అగ్ని, నీరు ఒకదానికొకటి వ్యతిరేకం.

Kitchen

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వంటగది (Kitchen) కేవలం భోజనాన్ని తయారు చేసే చోటు మాత్రమే కాదు. అది కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి , ఐశ్వర్యానికి మూలస్థానం అంటారు పెద్దలు.

వంటగది సరైన దిశలో లేకపోతే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు. వాస్తు ప్రకారం వంటగదికి ఉండాల్సిన బెస్ట్ దిశ ఆగ్నేయం (South-East)అని అంటారు

ఎందుకంటే ఆగ్నేయ మూల అగ్ని దేవుడికి నిలయం. పూర్వకాలం నుంచి వంటను అగ్నితోనే చేస్తారు. కాబట్టి, అగ్ని తత్వానికి సరిపోయే దిశలో వంటగది ఉండాలట

ఈ దిక్కులో వంట చేయడం వల్ల ఆ ఆహారం శక్తివంతంగా మారుతుందని, అది తినే వారికి ఆరోగ్యం చేకూరుస్తుందని కూడా పెద్దలు నమ్ముతారు. ఒకవేళ ఆగ్నేయంలో వీలు కాకపోతే ‘వాయువ్యం’ (North-West) రెండో ఆప్షన్ గా ఎంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Kitchen

కానీ పొరపాటున కూడా ‘ఈశాన్యం’ (North-East) లో వంటగది ఉండకూడదు. ఈశాన్యం అనేది దేవతా స్థానం , జల తత్వం ఉన్న దిశ, అక్కడ అగ్నిని ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది ,అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.

వంట చేసేటప్పుడు తూర్పు ముఖంగా నిలబడి చేసేలా ఉండాలి. గ్యాస్ స్టవ్ ఆగ్నేయంలో, సింక్ (నీటి కొళాయి) ఈశాన్యంలో ఉండాలి. ఎందుకంటే అగ్ని, నీరు ఒకదానికొకటి వ్యతిరేకం. అందుకే కాబట్టి వాటి మధ్య దూరం ఉండాలని నిపుణులు చెబుతారు. వంటగదిలో గోడలకు కానీ, కప్ బోర్డులకు కానీ వేసే రంగులు లేతగా ఉండటం మంచిది. ఇలా వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి, కుటుంబ సభ్యుల మధ్య కూడా అన్యోన్యత నెలకొంటుందని అంటారు.

Naari Naari Naduma Murari :నారీ నారీ నడుమ మురారి అన్ని వయసుల వారినీ మెప్పించిందా?

Exit mobile version